ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసేందుకు కుట్ర

బాబు ఇచ్చిన స్పీచ్‌నే ఈసీ పాటిస్తోంది

ఈసీపై చంద్రబాబు  ఒత్తిడి ఉంది

కరోనా పేరుతో రాజ్యాంగ హక్కులు కాలరాయడం సరికాదు

కేంద్రం నుంచి ఈసీ ఎలా నిధులు తెప్పిస్తుంది?

వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు

విశాఖ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేయించేందుకు కుట్ర జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు ప్రెస్‌మీట్లో ఏమి చెప్పారో..అదే వ్యాఖ్యలు ఇవాళ ఎన్నికల కమిషనర్‌ సీఎస్‌కు రాసిన లేఖలో ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్‌పై చంద్రబాబు ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖలో దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు. 
కరోనా పేరు చెప్పి రాజ్యాంగ పరమైన హక్కులను పక్కన పెట్టి ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయడమంటే, ఆరు వారాల తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇది నిరవధిక వాయిదే అవుతుంది.అది సక్రమం కాదని సీఎం చెప్పారు. చీఫ్‌ సెక్రటరీ ఎన్నికలు నిర్వహించాలని ఉత్తరం కూడా రాశారు. ఎన్నికల కమిషనర్‌ కొద్ది సేపటి క్రితమే స్పందించారు. ఎన్నికల వాయిదా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖను సంప్రదించినట్లు చెప్పారు. మహరాష్ట్ర, ఒరిస్సా, గోవా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలకు తానే ఆధ్యుడని రమేష్‌కుమార్‌ చెప్పుకుంటున్నారు.
రూ.5 వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాలి. ఎన్నికలు జరిపితే అధి సాధ్యమవుతుంది. ఆ నిధులకు, దీనికి లింక్‌ పెట్టకండి అంటూ ఎన్నికల కమిషనర్‌ చెబుతున్నారు. ఇదంతా చూస్తే..నిన్న సాయంత్రం చంద్రబాబు ఇచ్చిన ప్రెస్‌మీట్‌ను ఇవాళ ఎన్నికల కమిషనర్‌ ఉత్తర రూపంలో చీఫ్‌ సెక్రటరీకి రాశారు.   చంద్రబాబు ప్రెస్‌మీట్‌, ఇవాళ ఈసీ లెటర్‌ కంఫైర్‌ చేస్తే ఇది రుజువైంది. ఎన్నికలను నిర్వహించడానికి, రద్దు చేయడానికి ఎవరిని సంప్రదించాలి? రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల నిర్వాహణకు సహకరించేది ఇక్కడి సిబ్బంది, ప్రభుత్వమే. వాయిదాపై ప్రభుత్వంతో చర్చించాలి. అది చేయకుండా ఈసీ చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ఈసీ చెబుతున్నారు. అక్కడ ఇంకా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇక్కడ ప్రక్రియ ప్రారంభమై, నామినేషన్లు, ఉపసంహరణ అన్ని అయిపోయాయి, ఐదు రోజులు ఆగితే ఎన్నికలు పూర్తి అవుతాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలు వాయిదా వేయడం సమంజసం కాదు. 
కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు తాను బాధ్యుడిగా ఉంటానని ఎన్నికల కమిషనర్‌ చెబుతున్నారు. అసలు ఆయన ఎవరూ?, కేవలం ఎన్నికల కమిషనర్‌ మాత్రమే. ఆయన ప్రధాని కాదు, రాష్ట్రపతి కాదు. అలాంటప్పుడు రాష్ట్రానికి నిధులు ఎలా ఇప్పించగలవని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top