బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు 

ఎన్నికలకు ఆపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు

బీసీలకు రిజర్వేషన్లు అందకుండా చంద్రబాబు మోకాలడ్డు

చంద్రబాబు తన స్వార్థంతో బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు

విశాఖ:  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 34 శాతం సీట్లు ఇస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. చంద్రబాబు అడ్డుకున్నా బీసీల అభివృద్ధి ఆగదని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఆపేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఎన్నికలు ఆపేందుకు సుప్రీం కోర్టులో లివ్‌ పిటిషన్‌ వేశారని ధ్వజమెత్తారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు. 
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై చంద్రబాబు తన మనిషి బిర్రు ప్రతాప్‌రెడ్డితో సుప్రీం కోర్టులో కేసు వేయించారు. ఈ కేసు వేయకపోయి ఉంటే రాష్ట్రంలో 60 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. 2018 సెప్టెంబర్‌లో చంద్రబాబు హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని అఫిడవిట్‌ వేయించారు. భవిష్యత్‌లో కూడా మేం 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వమని స్పష్టంగా అఫిడవిట్‌ వేయించింది వాస్తవం కాదా?. రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారు. 60 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయమని చంద్రబాబే చెప్పారు. ఇప్పుడేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీసీలు చంద్రబాబు తీరు వల్లే నష్టపోయారు. బీసీలకు వైయస్‌ జగన్‌ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే అడ్డుపడింది చంద్రబాబు కాదా?. బీసీలు తనకు ఓట్లు వేయలేదనే కోపంతోనే చంద్రబాబు ఇలా చేశారు.  ఒక రాజకీయ నాయకుడిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? మళ్లీ  ఆయనే బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వలేకపోయినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో పది శాతం పెంచి బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తున్నాం. బీసీ అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారు. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయం. ఎన్నికల్లో వారిని గెలిపించుకుంటాం. ఇవాళ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు బీసీలకు మా పార్టీ తరఫున పది శాతం రిజర్వేషన్లు ఎక్కువ ఇస్తామని అనవచ్చు కదా?. ఇప్పుడు మేం అన్నామని రేపు చంద్రబాబు ప్రకటించవచ్చు. ఓడిపోయే పార్టీ 90 శాతం ఇచ్చినా ప్రయోజనం ఏంటి?. మాది గెలిచే పార్టీ 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారందరిని కూడా ఆయా పదవుల్లో కూర్చోబెడుతాం.
రిజర్వేషన్లపై ఇవాళ చంద్రబాబు సుప్రీం కోర్టులో లివ్‌ పిటిషన్‌ వేశారు. రిజర్వేషన్ల పేరుతో మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఎన్నికలు ఆగిపోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికలు జరిగితే 14వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.5 వేల కోట్లు రాష్ట్రానికి వస్తాయి. స్థానిక సంస్థలకు గ్రాంట్ల కింద వచ్చే కేంద్రం నిధులు ఆపేసేందుకు చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే భాగంలోనే చంద్రబాబు  ఇవాళ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అమరావతి పేరుతో ఐదు గ్రామాల రాజధాని అంశం ముగిసింది. ఆయన డ్రామాలు ప్రజలు గమనించడంతో మళ్లీ చంద్రబాబు తన డ్రామాను ఢిల్లీకి మార్చారు. ఎన్నికలు ఆపాలనే తాపత్రయంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో 26 లక్షల మంది పేదలకు  ఇళ్ల స్థలాలు ఇచ్చి, రాబోయే నాలుగేళ్లలో 30లక్షల ఇళ్లు కట్టించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ముందు  ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ భావించారు. కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని ముందు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక సంస్థలకు సమయం ముగిసింది. విశాఖ మున్సిపాలిటీకి 8 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు. అధికారాలన్నీ ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేసింది చంద్రబాబు కాదా?. 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో  బీసీలకు మూడో వంతు సీట్లు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తు ఒక్క చట్టమైన చేశారా?. ఒక్క సంస్థలోనైనా బీసీలకు మూడో వంతు అమలు చేశారా?. అధికారంలో ఉన్నప్పుడు  ఇచ్చిన హామీలు మరిచిపోయారు. ఇస్త్రీ పెట్టెలు, ఇరిగిపోయిన సైకిళ్లు ఇచ్చి కాలయాపన చేశారు. బీసీలను అవమానించిన రాజకీయ నాయకుడు చంద్రబాబు కాదా?. నామినేటెడ్‌ పదవులు బీసీలకు ఇవ్వలేదు. కానీ వైయస్‌ జగన్‌ ఇవాళ అన్ని విషయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. చట్టాలు చేశారు. కేబినెట్లో 60 శాతం మంత్రి పదవులను బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు ఈ వర్గాలకు చెందిన వారే. బీసీ కమిషన్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది వైయస్‌ జగన్‌ ప్రభుత్వమే. ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాలుగున్నర లక్షల మందికి  ఉద్యోగాలు ఇచ్చాం. వీరిలో 50 శాతం బీసీలకు ఇచ్చాం. మీ అబ్బాయి లోకేష్‌ ఐదేళ్లలో ఏం చేశారో అందరికి తెలుసు అన్నారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబును, టీడీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని దాడి వీరభద్రరావు పిలుపునిచ్చారు.

Back to Top