వైయస్ఆర్ జిల్లా: ఆంధ్ర రాజకీయాలతో సంబంధంలేని కేసీఆర్‌ను రెచ్చగొట్టే చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు.కడప వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర,తెలంగాణ ప్రజల మధ్య యుద్ధంగా చూపించే ప్రయత్నం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను పదేపదే రెచ్చగొడుతున్నారు.తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌తో పొత్తు కోసం పాకులాడింది చంద్రబాబుకు గుర్తులేదా అని ప్రశ్నించారు. కేసీఆర్..ఆంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వెళ్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తారని, చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా వ్యక్తిగత ప్రయోజనాలు కోసం ఓటుకు నోట్లు కేసులో ఇరుక్కుని రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను నేనే కట్టాను... హైటెక్‌సిటీని నేనే కట్టానన్నావు.దానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా ఉంది.అక్కడ అక్షరాస్యత పెరిగిందా..చంద్రబాబూ అని ప్రశ్నించారు.నువ్వు అభివృద్ధి చేసిందేమిటి.నీ అనుచరులకు సమాచారం ఇచ్చి ముందుకు గానే అక్కడ భూములు కొనిపించావన్నారు. ఇన్సైడర్ క్రైం అనేది చాలా పెద్ద క్రైం అన్నారు. విదేశాల్లో ఇలాంటి క్రైంలు చేసి గొప్పగొప్ప వాళ్లు జైలుపాలయ్యారన్నారు.భారతదేశంలో ఇలాంటి చట్టాలు లేక చంద్రబాబు తప్పించుకున్నారని తెలిపారు. వేల ఎకరాలను చంద్రబాబు తన మనుషుల చేత కారుచౌకగా కొనిపించారన్నారు. ఆ విధంగా మీ మనుషులకు లాభం చేసేందుకు చేసిన ప్రయత్నమే తప్ప హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందేమిలేదన్నారు.ఒక విదేశీ విద్యార్థి ఇన్సైడర్ ట్రేడింగ్‌పై రిసెర్చ్ చేసి నిరూపించిందన్నారు.ఈ ఫార్మూలా నేడు అమరావతికి కూడా చంద్రబాబు అమలుచేశారన్నారు. ముందుగానే సమాచారం ఇచ్చి చంద్రబాబు తన మనుషుల చేత భూములు కొనిపించారన్నారు. వారి మనుషులసంపదను మాత్రమే చంద్రబాబు పెంచుతున్నారన్నారు. గతంలో తొమ్మిదేళ్లు ఇదే పద్దతిలోనే పరిపాలించారని, చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అధికార వికేంద్రికరణ చేయకుండా సెంట్రలైజ్ చేస్తున్నారన్నారు. రాజధాని చుట్టూ అస్మదీయులు వందల,వేల కోట్లు కొన్నారని, అక్కడ డవలప్మెంట్ అంతా ప్రజలు కట్టిన సొమ్ముతో చేస్తున్నారన్నారు. ప్రజలందరిని సమానంగా చూడాల్సిన సీఎం చంద్రబాబు.. ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడి సంపద సృష్టించానని చెప్పడం ప్రజలను మోసగించడమేనన్నారు. అది చాలనంటూ చంద్రబాబు బినామీలు బ్యాంకు రుణాలు,పన్నులు ఎగ్గొడుతున్నారన్నారు.చంద్రబాబు చుట్టూ ఉన్న వ్యక్తులంతా బ్యాంకు రుణాలు,పన్నులు ఎగ్గొట్టినవారేనన్నారు.మతి భ్రమించి చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, భయం,ఆందోళన చంద్రబాబు ప్రవర్తనలో కనబడుతున్నాయన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ పనిచేస్తున్నారన్నారని, పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబులో చెగువేరా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అభిమానులు,ప్రజల మనోభావాలను పవన్ కల్యాణ్ గాలికొదిలేశారన్నారు. చంద్రబాబును మించిన వెన్నుపోటు దారుడు పవన్‌కల్యాణ్ అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పింది చేయడానికే పార్టీ పెట్టావా అని పవన్కల్యాణ్పూ మండిపడ్డారు. మాటనిలకడలేని వ్యక్తి పవన్‌కల్యాణ్ అని, పవన్‌కల్యాణ్‌కు చేతనైతే అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టాలన్నారు. లాలూచీ రాజకీయాలు మానుకుని పవన్ నిజాయతీ నిరూపించుకోవాలన్నారు.