ఏపీకి పట్టిన గ్రహణం చంద్రబాబు

వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సీ.రామచంద్రయ్య
 

అమరావతి:చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణమని వైయస్‌ఆర్‌సీపీ నేత సీ.రామచంద్రయ్య పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రజల సమాచారాన్ని ఐటీ కంపెనీలకు టీడీపీ ధారాదత్తం చేసిందని విమర్శించారు. ఇది చాలా పెద్ద క్రైమ్, ఈసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. డేటా బ్రీచింగ్‌లో చంద్రబాబు, లోకేష్‌ హస్తం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి చేస్తున్నారన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే కేసులు పెట్టే పరిస్థితి ఏపీలో ఉందన్నారు. 
 

Back to Top