చంద్రబాబులో అభద్రతా భావం..

టీడీపీ ఖాళీ అవుతుందనే భయం పట్టుకుంది..

తెలంగాణ,ఆంధ్రా ప్రజల మధ్య చిచ్చుపెట్టే యత్నాలు..

అరాచక, అప్రజాస్వామిక శక్తిగా చంద్రబాబు..

వైయస్‌ఆర్‌సీపీ నేత సి.రామచంద్రయ్య

హైదరాబాద్‌: తెలంగాణ,ఆంధ్రా ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రాలో సెంటిమెంట్‌ రేకెత్తించాలని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ,ఆంధ్ర వివాదంగా చిత్రీకరించి ఓట్లు సంపాదించుకోవాలనే వ్యూహం తప్ప ఏమీలేదన్నారు.రెండు రాష్ట్రాల ప్రజలు మంచి సయోధ్యతో ఉన్నారన్నారు. చంద్రబాబు చూపిస్తున్న కుల వివక్షతను పార్టీలో  భరించలేక టీడీపీ వీడినట్లు అవంతి శ్రీనివాస్,పండుల రవీంద్రబాబు,ఆమంచి కృష్ణమోహన్‌లు చెప్పడం జరిగిందన్నారు.ఆస్తులకు,కేసీఆర్‌కు సంబంధం ఏమిటీ అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలలో అర్థం ఉందా అని ప్రశ్నించారు.హైదరాబాద్‌లో పదేళ్లు పాటు ఉండే హక్కు ఉందని,ఒక సంవత్సరానికే చంద్రబాబు ఆంధ్రకు పరిగెత్తారన్నారు. కేసీఆర్‌ చంద్రబాబును బెదిరించారా అని ప్రశ్నించారు. ఏ భయంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరారని ప్రశ్నించారు.కిశోర్‌ చంద్రదేవ్‌ను ఎవరు బెదిరించారు..వీరిని  కేసీఆర్‌ బెదిరించారా..చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. సర్వేలో వారికి సానుకూలత రాలేనందున..సీట్లు దక్కవనే వైయస్‌ఆర్‌సీపీలోకి వెళ్ళిపోయారని టీడీపీ నేత కళా వెంకట్రావ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు.నాగార్జున కలిస్తే దాని రాజకీయం చేస్తారా...ఎందుకంత ఉక్రోషం అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ముద్దాయిని నేరస్తుడు అని అనడం ఎంత వరుకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఎన్ని కేసుల్లో నేరస్తుడు అని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఎన్ని కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదు అని నిలదీశారు.చంద్రబాబు నోరు అదుపులోని పెట్టుకుని మాట్లాడాలన్నారు. దిగజారుడు రాజకీయాలు వద్దని హెచ్చరించారు.వాస్తవంగా జనరంజకంగా పరిపాలిస్తే ప్రజలను నిన్ను ఎన్నుకుంటారని లేకపోతే తిరస్కరిస్తారని దుయ్యబట్టారు. గెలవాలని నానావిధాలు ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. నేరస్తులకు వంత పాడుతున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చింతమనేని దళితులను దూషిస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.దళితులను అవమానాలకు గురిచేస్తున్నారన్నారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశావని, అందులో నలుగురిని మంత్రులను చేసి, స్పీకర్‌ పదవిని కూడా అపవిత్రం చేశావని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు టీడీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు.

పార్లమెంటు చరిత్రలో చంద్రబాబు అంతా అరాచక,అప్రజాస్వామిక శక్తి ఎక్కడ ఉండరన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాస్వామిక విలువలు కాపాడే వ్యక్తి అని అన్నారు.వైయస్‌ఆర్‌సీపీలోకి చేరేవారిని వారి పదవులకు,పార్టీకి రాజీనామాలు చేసిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటున్నారన్నారు.మొన్న దాసరి జై రమేష్‌  వైయస్‌ జగన్‌ను కలిస్తే..ఆయనను ఉద్దేశించి పారిశ్రామికవేత్తలకు టిక్కెట్ల ఇస్తున్నారని టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారన్నారు. జై రమేష్‌ టీడీపీకి ఎంత సాయం చేశారో చంద్రబాబు మరిచిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీకి సాయం చేసినప్పుడు ఆయన పారిశ్రామిక వేత్త కాదా అని ప్రశ్నించారు.టీడీపీలో ఉన్న సుజనాచౌదరి, రాయపాటి.కేశినేని, గల్లా జయదేవ్, మురళీమోహన్‌ వీరంతా పారిశ్రామిక వేత్తలు కాదా అని ప్రశ్నించారు. ఒకరి వైపు ఒక వేలు చూపిస్తే నీ వైపు మూడు వేళ్లు చూపిస్తున్నాయన్నారు. సీఎం  స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు హేళన చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. పుల్వామా ఘటనకు బాధ్యతగా మోదీ రాజీనామా చేయాలని చంద్రబాబు వ్యాఖ్యనించారని,  పుష్కరాల్లో  ప్రచార ఆర్భాటానికి 36 మంది బలయ్యారని.. అప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 

తాజా వీడియోలు

Back to Top