నెల్లూరు రూరల్ లో వైయ‌స్‌ఆర్‌ సీపీకి ప్రజాబలం ఉంది

  వైయ‌స్ఆర్‌ సీపీ నేత ఆనం విజయ్ కుమార్‌ రెడ్డి

నెల్లూరు:  వ్య‌క్తులు మారినంత మాత్ర‌నా పార్టీకి న‌ష్ట‌మేమి లేద‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా బ‌లం ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి అన్నారు.  పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచార‌ని గుర్తు చేశారు. కోటంరెడ్డికి  12  సిమ్ కార్డులు ఉన్నాయట..లిక్కర్‌, గంజాయి, హత్యలు చేసే వారికే అన్ని సిమ్‌లుంటాయని వ్యాఖ్యానించారు. సర్పంచ్‌, ఎంపీపీ, ఎంపిటీసీలు అంద‌రూ కూడా నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారని తెలిపారు. కోటంరెడ్డి దగ్గరున్న ఇద్దరు కార్పొరేటర్లు కూడా వైయ‌స్ఆర్‌సీపీలోకి  వచ్చేస్తారని ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 

Back to Top