మంగళగిరి పోస్టల్‌ బ్యాలెట్‌ బూత్‌లో టీడీపీ నేతలు హల్‌చల్‌..

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు

బూత్‌ల్లోకి వెళ్లడానికి టీడీపీ నేతలకు ఏం అధికారం ఉంది..?

పోలీసు వాహనాల్లో డబ్బులను తరలిస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి

 

అమరావతి: మంగళగిరిలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి  అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళగిరి పోస్టల్‌ బ్యాలెట్‌ బూత్‌లోకి టీడీపీ నేతలు వెళ్లడం తప్పుబట్టారు. ఓట్లరను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతల ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు హడావుడి చేస్తున్న పోలీసులు చొద్యం చూస్తున్నారన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ బూత్‌లోకి వెళ్లడానికి టీడీపీకి నేతలకు  ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. సాక్షాత్తూ డిఎస్పీ స్థాయి అధికారి ఉన్న కూడా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారన్నారు. నంద్యాల ఎన్నికల్లో కూడా ఒక అధికారిని కూడా స్వేచ్ఛగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోలేని దాఖలాలు చూశామన్నారు.

అధికారులను సైతం భయపెట్టి  పబ్బం గడుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.ఏపీ 14పి అనే పోలీస్‌ వాహనాలు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ వేసుకుని మంగళగిరి నియోజకవర్గంలో ఎందుకు తిరుగుతున్నాయనేది పోలీసు అధికారులు స్పష్టంగా చెప్పాలన్నారు.పోలీసుల వాహనాల్లోనే డబ్బుల ముఠాలను తరలిస్తున్నారన్నారు. తెలుగుదేశం నేతలు ఓటుకు 10వేల 15 వేల రూపాయలు డబ్బులు పంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని,  పోలీసులు పట్టింంచుకోవడంలేదన్నారు.ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

 

Back to Top