జతకట్టిన జెండాలన్నీ కనుమరుగవుతాయి

వైయ‌స్ఆర్‌సీపీ క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ బి.ఎస్ మక్బూల్

అనంత‌పురం: రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జతకట్టిన  జెండాలన్నీ కనుమరుగైపోతాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బి.ఎస్ మక్బూల్ పేర్కొన్నారు. సోమవారం గార్లపెంట మండల కేంద్రంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయాన్నే ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గాండ్లపెంట ప్రజల ఆదరాభిమానాలకు ధన్యుడను.  ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మిగిలేది ఒకే ఒక జెండా అది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా.  ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించడానికి ఎన్నికలు ఎప్పుడు అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగనన్న విజయానికి గాండ్లపెంట వైయ‌స్ఆర్‌సీపీ సైనికుల చేస్తున్న శ్రమను ఖచ్చితంగా గుర్తిస్తామ‌ని హామీ ఇచ్చారు.  గాండ్లపెంట మండలంలో గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని మ‌క్బూల్ పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడంతో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న నాకు, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞ‌ప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సాదత్ అలీఖాన్, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
 

Back to Top