వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన‌ ఎస్వీ మోహన్‌ రెడ్డి

వైయస్‌ఆర్‌సీపీకి అన్యాయం చేశా..

తప్పు తెలుసుకున్నా..తిరిగి వచ్చా..

కష్టపడేవారిని గౌరవించే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఎస్వీ మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆయనకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  వైయస్‌ఆర్‌సీపీలోకి రావడం మళ్లీ తన సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని తెలిపారు.  వైయస్‌ఆర్‌సీపీకి అన్యాయం చేసి బయటవెళ్ళానని, టీడీపీలో అన్యాయానికి గురిఅయ్యాయని తెలిపారు. చేసిన తప్పును తెలుసుకుని తిరిగి  వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చినట్లు తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ విజయానికి కృషిచేస్తానని తెలిపారు. పనిచేసేవారిని  గౌరవించడం వైయస్‌ జగన్‌ను తెలుసు అని, తన జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ స్థానాలు గెలిపించి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇస్తానని తెలిపారు. పదవులు కోసం వైయస్‌ఆర్‌సీపీలోకి రాలేదని, పార్టీకి పని చేయడానికి మాత్రమే వచ్చానన్నారు. మోసం చేసే నైజం లేని చిత్తశుద్ధి గల నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు, 

Back to Top