వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరుతున్నా..

త‌ప్పు తెలుసుకున్నా.. వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యానికి కృషి చేస్తా

వైయ‌స్ జ‌గ‌న్ నాకు ఎలాంటి అన్యాయం చేయ‌లేదు

ఎస్వీ  మోహ‌న్ రెడ్డి 

కర్నూలు : మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైఎస్సార్ సీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన  తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని ఆయన తెలిపారు. కర్నూలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హఫీజ్‌ ఖాన్‌ను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎస్వీ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని తెలిపారు.

Back to Top