వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం

చిత్తశుద్ధి గల నేత వైయస్‌ జగన్‌

సీట్లు కేటాయింపులో సామాజిక న్యాయం

మైదుకూరు అభ్యర్థి రఘురామిరెడ్డి 

వైయస్‌ఆర్‌ జిల్లా: వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ మైదుకూరు  అభ్యర్థి రఘురామిరెడ్డి అన్నారు.ఆయన ఇడుపుల పాయలో  మీడియాతో మాట్లాడారు.టిక్కెట్ల కేటాయింపు వైయస్‌ఆర్‌సీపీ సామాజిక న్యాయం పాటించిందన్నారు.బీసీలు,మహిళలు,మైనారీటీలు పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు.చంద్రబాబు ఎన్నికల ముందే ఓటమి అంగీకరించారని తెలిపారు.చంద్రబాబు బీసీ ఓట్లు కోసం బీసీ నినాదంతో ముందుకు వెళ్తుతున్నారన్నారు.బీసీలకు అన్యాయం చేసి వ్యక్తి చంద్రబాబే అని అన్నారు.వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారని తెలిపారు.దాదాపు 41 స్థానాలను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  బీసీలకు ఇవ్వడం హర్షణీయమన్నారు.టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించారని తెలిపారు.బీసీలంతా వైయస్‌ఆర్‌సీపీ వైపే ఉన్నారన్నారు.చంద్రబాబు పాలనలో మోసపోయామని బీసీలందరూ తెలుసుకున్నారన్నారు.అలాగే మైనార్టీలకు ఐదు సీట్లు కేటాయించిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిదేనని అన్నారు.

Back to Top