7 ఘటనల ఫుల్‌ వీడియోలు ఎందుకు బయటపెట్టదు?

వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు?

పాల్వాయిగేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?

13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూటి ప్ర‌శ్న‌లు

తాడేప‌ల్లి: మాచర్లలో టీడీపీ గూండాలే దాడులు చేశారని, అమాయక ఓటర్లపై దాడులకు తెగబడ్డారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ గూండాలే దాడులు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని, వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్ర‌శ్నించారు. దాడి వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదని నిల‌దీశారు. ఈ మేర‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల క‌మిష‌న్‌కు సూటి ప్రశ్నలు సంధించారు. 

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయిగేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వస్తుంది?.. 

మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్‌ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 

అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది? తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల రామ‌కృష్ణారెడ్డి ప్రశ్నించారు. 

  • 13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?
  • గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?
  • స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?
  • పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?
  • ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్‌ ఆ ఫుటేజీని చూడలేదా?
  • అసలు ఇంతకాలం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఏం చేశారు?
  • మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్‌వాల్వ్‌ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది?
Back to Top