తాడేపల్లి: చంద్రబాబు మాట్లాడుతున్న అంశాలు చూస్తే ఆయన రాష్ర్టానికి అవసరమా అనిపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖలో క్రైమ్ రేట్ పెరగలేదు చంద్రబాబు హయాం కంటే బాగా తగ్గింది....తెలుగుదేశం పార్టీ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి...దివంగత నేత వైయస్ఆర్ హయాంలో విశాఖ ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉందో నేడు అదే విధంగా ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్,చంద్రబాబులు కావాలని విశాఖపై శాంతిభధ్రతలు క్షీణించాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విశాఖ రాజధాని గా వైయస్ జగన్ ,ప్రభుత్వం అక్కడకు మూవ్ అవుతుందని తెలిసినప్పటినుంచి చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఒకరితర్వాత ఒకరు అక్కడకు వెళ్లి కూర్చుని అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్కడ ఏదో ఘోరాలు జరగబోతున్నాయని ప్రచారం చేయాలని చేస్తున్నారు.2014లో సైతం చంద్రబాబు ఇలానే చేశారు. చంద్రబాబు హయాంలో ఘోరాలు జరగాయి వాటిని సరిచేసే పనిలో వైయస్ జగన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్ళి మాట్లాడుతున్న విధానం చూస్తే విశాఖకు రాజధాని రాకూడదనేది వారి కోరిక. అక్కడి ప్రజలను టెర్రరైజ్ చేస్తున్నారు.పవన్ ప్రతిరోజు గుట్టలు,కొండలు దగ్గరకు వెళ్తూ అక్కడేదో జరిగిందని యాగి చేస్తున్నారు. ఇసుక దిబ్బలు దగ్గరకు వెళ్తున్నారు ప్రపంచంలోని పర్యావరణ రక్షణ అంతా తానే చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు.వైయస్ఆర్‌సీపీ, వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేసేదిగా ఉంటుంది అని అన్నారు. చంద్రబాబు ఉన్నసమయంలో సరైన పరిపాలన లేదు.లా అండ్ ఆర్డర్ లేదు.
వైయస్ఆర్ సిపి ఓటమి లేదా వైయస్ జగన్ ఓటమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. కొద్దిరోజులు అందరూ కలుస్తామని...మరికొద్దిరోజులు ఎవరెవరు కలుస్తామో తెలియదని చెప్పారు. ఈ మధ్య తాను ఒక్కడినే రావచ్చు....ఇద్దరం లేదా ముగ్గురం కలిసి రావచ్చని ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే ఓటు చీలకూడదని అన్నాడో దాంట్లోనే ఎంతమంది వీలైతే అంతమందిమి కలుస్తామనేది ఉంది. పవన్ కల్యాణ్ ఎవరెవరు కలవాలనేది నిర్ణయించలేడు అది మేం ముందునుంచి చెబుతున్నామని తెలిపారు. ఆయన పార్టీ నిర్మాణం,ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వచ్చిన ఓట్లశాతం,ఆయన స్దాయి ఇలా ఏ రకంగా చూసినా దానిని నిర్ణయించేది చంద్రబాబు అనేది తెలుసు. 2019 లో చంద్రబాబు విడిగా పోటేచేయాలని పవన్ కోరితే విడిగా పోటీచేశాడు. నేడు ఓటు చీలకూడదు కాబట్టి కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నారు.ఆయన ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా వారిద్దరూ కలిసే ఉన్నారు. అది విడిగా పోటీచేసినా...కలిసి పోటీచేసినా కలిసే ఉంటారు అని తెలిపారు. మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు రోజుకొకరకమయినా స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. మీడియాలో డిబేట్లకు పనికివస్తాయి. టెంపో బిల్డ్ చేయడానికో బేరం పెంచుకోవడానికో పవన్ కల్యాణ్ ఇలా చేస్తున్నారని భావించవచ్చు.
ఈ వీడియోలు చూస్తే చంద్రబాబు రాష్ట్రానికి అవసరమా అనిపిస్తోంది..
చంద్రబాబు విజన్ 2047 అంటూ చెబుతున్న దానిపై ప్రశ్నించగా ఆయన నేడు చెబుతున్నవన్నీ కూడా 2014-2019 మధ్య ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.చంద్రబాబు 1970 దశకం నుంచి రాజకీయాలలో ఉన్న చంద్రబాబు మానసిక స్దితి తెలుసుకోవాలంటే ఈ వీడియోలు చూస్తే అర్ధమవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వీడియోలను ప్రదర్శించారు. చంద్రబాబు బహిరంగ సభలో రాత్రి సమయంలో సెల్ ఫోన్లు లైట్లు వేయమని చెప్పి ఆ టార్చ్ లైట్ వెలుగు చూస్తూ ఈ టెక్నాలజీ ని తానే తెచ్చానంటూ చంద్రబాబు ప్రకటించారు. మరో వీడియోలో తాను ఇచ్చిన రాఖీ దేవుడు దగ్గర పెట్టి పూజించి భగవత్ సంకల్పం అనుకుంటే అందుకు చంద్రబాబు అండగా ఉంటానని చెప్పారు.ఇలాంటివి గతంలో జూమ్ లో కనిపించి చెప్పాడు. నేడు రోడ్లపై తిరిగి చెబుతున్నాడు. ఆ సభలకు తరలించిన జనం ముందు ఇలాంటివి చెబుతుంటే రాష్ర్ట ప్రజల పరిస్దితి,ఆయనను నమ్ముకుని ముందుకు వెళ్తూ చంద్రబాబును సిఎంను చేసేందుకు పనిచేస్తున్న పవన్ కల్యాణ్ పరిస్దితి ఏంటి. ఇలాంటి వారిని పగటివేషగాళ్లు అనాలా...పిట్టల దొరలు అనాలా అని అన్నారు. వైయస్ జగన్ ప్రజలకు ఏది కావాలో వాటిని అమలు చేస్తూ ప్రణాళికాబధ్దంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రజలు కూడా వైయస్ జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలి..
యార్లగడ్డ వెంకట్రావు ఇష్యూకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలపై మాట్లాడుతూ గన్నవరంలో పార్టీనేత యార్లగడ్డ వెంకట్రావ్ ముందే ఒక నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా మాట్లాడుతున్నారని ఇది ఆయన వైఖరిని బట్టి అర్ధమవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీలో యార్లగడ్డ వెంకట్రావ్ కు సమస్యలుంటే అంతర్గతవేదికలపై మాట్లాడాలి. బహిరంగవేదికలపై మాట్లాడకూడదు. ఆయన గతంలో సమస్యలున్న సందర్భాలలో మమ్మల్ని కలిసి చెప్పారు. అదేవిధంగా ఇంకా పార్టీలో సీనియర్లు కోఆర్డినేటర్లు అయిన అయోధ్యరామిరెడ్డి ఉన్నారు ఆయనను కలిసి ఆయనకున్న బాధను చెప్పవచ్చు. ఆయనకు బాధ ఉంటే పార్టీని అయినా కన్వీన్స్ చేయాలి లేదా ఆయన అయినా కన్వీన్స్ కావాలి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వ్యక్తిగత స్వేఛ్చ ఉంటుంది. దానికి భిన్నంగా ఏదైనా చేయాలంటే వారి స్వేఛ్చ మేరకు చేయవచ్చని గతంలోనూ చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను అందుకు కట్టుబడి ఉన్నాను అని వివరించారు.
పార్టీకోసం కష్టపడి పనిచేసే వారికి వైయస్ఆర్ సిపిలో ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుంది. వైయస్ జగన్ అలా పనిచేసేవారిని గుర్తించి తగిన పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. అది పార్టీలో కష్టపడి పనిచేసే వారందరికి తెలిసిన విషయమే. మాది బలమైన పార్టీ కాబట్టి చాలామంది వారి భవిష్యత్తుకోసం ఆశిస్తారు కాబట్టి వత్తిడి ఎక్కువ ఉంటుంది. అయితే అవకాశాలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి కొంతమందికే అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో మరికొందరికి రావచ్చు అని అన్నారు. చంద్రబాబు లేదా టిడిపి నేతలతో యార్లగడ్డ వెంకట్రావు కాంటాక్ట్ లో ఉన్నాడని మా పార్టీ నేతలు ఎవ్వరూ అనలేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆన్ రికార్డ్ గా మా పార్టీ నేతలు అలా అన్నట్లు నా దృష్టికి రాలేదు. యార్లగడ్డ వెంకట్రావ్ ను పోతేపో అనే విధంగా ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని అన్నారు. అలా ఎందుకు అంటారు. పార్టీపైనో,నాయకుడిపై అభిమానంతోనే స్వఛ్చంధంగా వచ్చి పనిచేసేవారిని వారి వారి అవకాశాలు వారికున్నప్పుడు అలా ఎవరైనా ఎందుకు వ్యాఖ్యానిస్తారు. ఎవరైనా ఇంటర్ పెటేషన్ చేసి ఆ వ్యాఖ్యలను అలా చిత్రీకరించి ఉండవచ్చు అని వివరించారు. అలా అన్నవారే దాని గురించి చెప్పాలి అని అన్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు పెట్టిన సమావేశాలు మూడుసార్లు నిర్వహించారు. బహిరంగంగా అక్కడినుంచి ఆయన ఉద్దేశ్యాలను వెల్లడించడం సరికాదన్నారు. ఏ పార్టీలో అయినా అంతర్గతంగా చర్చించుకోవాలి అని పునరుద్ఘాటించారు.
ఎవరైనా సరే ఎంఎల్ఏ అయితేనే అనేది పరమావధికాదు. పార్టీలో సేవలందించవచ్చు. లేదా ఒకసారి ఎంఎల్ఏగా చేసి తర్వాత పార్టీ పదవులలో కొనసాగవచ్చు అలా ఎంతోమంది పార్టీలో ఉన్నారు అని వివరించారు. ఎంఎల్ఏ టిక్కెట్ రాకపోతేనో పార్టీలో పదవి రాలేదనో ఓపెన్ గా మాట్లాడటం సరికాదన్నారు. 2019లో యార్లగడ్డ వెంకట్రావ్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.చాలా కష్టపడ్డారు. తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల తను విక్టిమ్ అయ్యానని ఆయన అనుకుంటున్నారు. కాదు మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము భావించాం. అదే ఆయనకు చెప్పాం అని తెలియచేశారు. ఒకసారి యార్లగడ్డ వెంకట్రావు తప్పుకుంటానని నిర్ణయం తీసుకున్నాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆయన వ్యక్తిగత నిర్ణయం అవుతుందని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమం పట్ల సీఎం ఉన్నారు
ఉద్యోగుల సంక్షేమం పట్ల, వారి సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజషన్ ప్రక్రియలో రాష్ట్ర విభజన నాటికి ఐదేళ్ళ సర్వీస్ ఉండాలనే నిబంధనను సడలించి, ఆ నాటికి విధుల్లో ఉన్నవారందరినీ రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా కాంట్రాక్ట్ లెక్చరర్ల జె.ఎ.సి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు తాడేపల్లిలో "జగనన్నకు ధన్యవాదాలు" పేరుతో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ల న్యాయమైన అభ్యర్థనను ఎలాంటి ధర్నాలు, ఉద్యమాలు లేకుండానే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. వైయస్ జగన్ ఉద్యోగులపట్ల ఎంత సహృదయంతో ఉంటారనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. దీనిని బట్టి ప్రత్యేకించి కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కి ఉన్న సానుభూతి ఎంత గొప్పదో తెలుసుకోవాలన్నారు. సర్వీస్ రెగ్యులర్ కాబోతున్న వారంతా అంకితభావంతో, విద్యారంగం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజమాలతో సజ్జల రామకృష్ణారెడ్డి వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ జె.ఏ.సి ఛైర్మన్ కుమ్మరకుంట సురేష్, కో-చైర్మన్ కల్లూరి శ్రీనివాస్, మహిళా కార్యదర్సులు డి.ఉమాదేవి, బండి సంధ్యా లత,దీప,దుర్గా మల్లీశ్వరి నాయకులు హజరత్,శివ గంగా ప్రసాద్, యూ. శ్రీనివాసరావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.