సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్‌ఆర్‌ఐలు స్వచందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చెయ్యడం సంతోషం

ప్రజల్లో సీఎం వైయ‌స్ జగన్ చేసిన  మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు

మన రాష్ట్రంలో మళ్ళీ సీఎం వైయ‌స్ జగన్ పాలన రావాలని  కోరుకుంటున్నారు

సీఎం వైయ‌స్ జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే

ఇది ఆకతాయిల చర్య కాదు

దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అర్థరహితం

ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి

వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది

బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా విచారణలో తేలుతుంది

తప్పు చేసినోడు నన్ను ఇరికించారాని మాట్లాడితే చెల్లుతుందా?

తాడేప‌ల్లి:  సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో వైయ‌స్ జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే.. అది ఆకతాయిల చర్య కాదన్నారు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రచార రథాలను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా స‌జ్జ‌ల మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో సీఎం వైయ‌స్‌ జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు.. మన రాష్ట్రంలో మళ్లీ సీఎం వైయ‌స్‌ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.   సీఎం వైయ‌స్‌ జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే.. ఇది ఆకతాయిల చర్య కాదని పేర్కొన్నారు. 

సీఎం వైయ‌స్ జగన్‌పై దాగి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మాటలు అర్థరహితం అని మండిపడ్డారు. ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి.. కానీ, వాళ్లను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ప్రశ్నించారు. బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? విచారణలో తేలుతుందన్నారు. తప్పు చేసినోడు నన్ను ఇరికించారాని మాట్లాడితే చెల్లుతుందా..? అని నిలదీశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, సీఎం వైయ‌స్ జగన్ పై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ రోజు ఈ కేసులో ఏ-1గా భావిస్తోన్న వ్యక్తిని కోర్టులో హాజరుపర్చిన విషయం విదితమే.

సీఎం వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్‌ అరెస్ట్ 
విజయవాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్‌ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్‌ ఏ1గా ఉన్నాడు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
 
కాగా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం వైయ‌స్ జగన్‌పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే. సీఎం వైయ‌స్ జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.

గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం వైయ‌స్ జగన్‌ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. సీఎం జగన్‌ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం వైయ‌స్ జగన్‌ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 

Back to Top