తాడేపల్లి: రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతామని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొననున్న'మేము సిద్దం - మా బూత్ సిద్ధం' సమావేశం ఏర్పాట్లను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీనేతలు పరిశీలించారు. మంగళగిరిలోని CK కన్వెన్షన్ లో మంగళవారం జరగనున్న 'మేము సిద్దం - మా బూత్ సిద్ధం' సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు,రీజనల్ కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీయస్ మండల ఇంచార్జిలు, నియోజకవర్గ ఎన్నికల బూత్ ఇంఛార్జ్, జేసీయస్ నియోజకవర్గ ఇంఛార్జ్, నియోజకవర్గ ఎలక్షన్ హెడ్, పార్టీ పరిశీలకులు మరియు జిల్లా జేసీయస్ కో-ఆర్డినేటర్లు పాల్గొననుండటంతో వారికి సౌకర్యవంతంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో పార్టీ నేతలకు,భధ్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న వేదిక సమీపంలో ఏర్పాట్లు, సమీపంలోని పలు సమావేశమందిరాలలో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో వారికి తెలియచేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జరగబోయే కీలకమైన సమావేశం ఇది అన్నారు. క్షేత్రస్థాయి...మండల స్దాయి,పోలింగ్ బూత్ స్దాయిలో కీలకంగా వ్యవహరించే కార్యకర్తల సమావేశం ఇది అని అన్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకులు, జేసిఎస్ కోఆర్డినేటర్లు, పోలింగ్ బూత్ ఇన్ ఛార్జ్ లు, నియోజకవర్గాలలో ఎన్నికలను పర్యవేక్షించే నేతలు పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి,మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు ఈ సమావేశంలో భాగంగా పాల్గొంటున్న పార్టీ శ్రేణులను ఉధ్దేశించి కీలకమైన ప్రసంగంతోపాటు దిశానిర్దేశం చేస్తారని తెలియచేశారు. ఎన్నికలలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.ప్రత్యర్దులి ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూసుకోవాలి.ప్రజలలో మమేకమై ఇంతకాలంగా చేస్తున్న పనులను ప్రజలలోకి మరింతగా తీసుకెళ్లేలా ఏమి చర్యలు తీసుకోవాలి.వారి ఆశీస్సులు ఏవిధంగా కోరాలో ముఖ్యమంత్రి వివరిస్తారు. మా పార్టీ అభ్యర్దుల ఎంపిక దగ్గర్నుంచి గడపగడపకు మన ప్రభుత్వం ప్రారంభించిన దగ్గర్నుంచి వైయస్సార్ సిపి ఎప్పుడు ప్రజలలోనే ఉంది. నాయకులు ఎప్పుడు ప్రజలలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు చేస్తున్న పనుల గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను తీర్చేప్రయత్నం నిరంతరం జరుగుతుంది.ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది ఎన్నికల టీమ్ ను ఏర్పాటుచేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించారు.ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో పూర్తి అయింది. అందులో భాగంగానే కమిటీలను నియమించాం.ఇప్పుడు పోలింగ్ బూత్ స్దాయిలో కమిటీలు కూడా తయారయ్యాయన్నారు. సమర్ధంగా పనిచేయగల పోలింగ్ బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేశాం.వారికి ఓరియెంటేషన్ ఇచ్చే ప్రక్రియ రేపు జరుగుతోంది అని వివరించారు. ప్రజాస్వామ్య పధ్దతిలో సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి పార్టీ పరంగా మా యంత్రాంగం రేపటి సమావేశం తర్వాత సిధ్దం అయినట్లు అవుతుందన్నారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఐదేళ్లుగా ప్రజలకు అందించిన మంచిని వివరిస్తూ ప్రజలు మనస్పూర్తిగా ఓటు వేసుకునే విధంగా అవసరమైన వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. మా పార్టీ అభ్యర్దులను ఎంపిక చేసే సమయంలో పలు విమర్శలు చేసినప్పుడు అప్పుడే మేం చెప్పడం జరిగింది...మేం ఆరోజే చెప్పాం...మీది(టిడిపి-జనసేన) మొదలుకాబోతోందని చెప్పాం.ఇప్పుడు అదే జరుగుతోంది.మా పార్టీకి సంబంధించనంతవరకు అసంతృప్తులెవరైనా ఉంటే పిలిచి మాట్లాడుతున్నాం..అందరూ సిఎం జగన్ గారిపై విశ్వాసం ఉన్నవారే కాబట్టి అంతా అర్ధం చేసుకుని సర్దుకున్నారని వివరించారు. టీడీపీ,జనసేన సీట్ల సర్ధుబాటు అతుకుల బొంతగా కనిపిస్తోందన్నారు.పవన్ కల్యాణ్ ను అనుసరించేవారు ఎన్ని ఎక్స్ పెక్ట్ చేసారో తెలియదు కాని పవన్ ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారని అన్నారు.వారి పార్టీ అంతర్గతం అన్నారు.ఆ పార్టీలనుంచి చాలామంది వస్తారని అంటున్నారు కాని మా పార్టీ నాయకులు జగన్ గారి విధానం ఒక్కటే వచ్చినవారి వల్ల పార్టీకి ఉపయోగం...వారి రికార్డ్ బాగానే ఉంటే కన్సిడర్ చేయవచ్చుగాని.....గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం అన్నారు.దానివల్ల ఎన్నికలకు ముందు వచ్చే తలనొప్పులు ఉంటాయి.దానిపట్ల మాకు అంతగా ఆసక్తి లేదన్నారు. శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైయస్ఆర్‌సీపీ 175 కి 175 గెలవబోతోందని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీకి లభిస్తున్న ఆదరణ చూస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం పేరిట నిర్వహించిన సభలు సక్సెస్ అయ్యాయని అన్నారు.నాలుగో సిధ్దం సభ మార్చి 3వ తేదీన జరగబోతోందని తెలియచేశారు.మూడు సభలలో లక్షలాది మంది ప్రజలు స్వఛ్చంధంగా తరలివచ్చారని అది చూస్తే ప్రత్యర్ధి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సమయంలో రేపటి సమావేశం కీలకం కాబోతోందని అన్నారు. ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పార్టీ నేతలను దశదిశా నిర్ధేశం చేస్తారన్నారు. క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలో వివరిస్తారని తెలియచేశారు. మండల,పట్టణ,నగర,జిల్లా స్దాయిల్లోని కీలకమైన నాయకులు,బూత్ లెవల్లో నాయకులంతా రేపటి సమావేశానికి రానున్నారని వివరించారు.పార్టీ పరంగా వివిధ హోదాల్లో ఉన్న 2700 మందికి ఆహ్వానాలు పంపించామని అన్నారు.