పండుగలా ఏడాది పాలన

23న వైయస్‌ఆర్‌సీపీ జెండా  ఆవిష్కరణ

కరోనా నేపథ్యంలో నిబంధనల మేరకు ఊరూరా వేడుకలు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ నెల 23వ తేదీకి ఏడాది అవుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏడాది పాలనను పండుగలా నిర్వహించుకుందామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.  వై.య‌స్‌.ఆర్‌. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంది ఈ నెల 23 నాటికి సరిగ్గా ఏడాది. ప్రజల ఆశలు-ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా ప్రియతమ ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు సమూలమైన మార్పులు తెచ్చారు. తొలి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90శాతం నెరవేర్చి, ప్రకటించని 40 కొత్త పథకాలు అమలు పరుస్తూ, దేశంలోనే అత్యుత్తమ సీఎంగా, మంచి మనసున్న ముఖ్యమంత్రిగా మన్ననలు పొందారు.

23వ తేదీన అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌తో పాటు మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగరేయాలి. పేదలకు పండ్ల పంపిణీతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలి.

30వ తేదీ వరకు ప్రగతిపై ప్రచారం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందిన వారి డేటాను సేకరించాలి. వాటితో పాటు మీ నియోజకవర్గాల్లో మీరు సొంతంగా సాధించిన ప్రగతిపై పాంప్లేట్లు, వీడియోలు, ప్రకటనల రూపంలో మన పార్టీకి గెలుపు అందించిన 23వ తేదీ నుంచి మన ప్రియతమ నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30 వరకు ప్రచారం నిర్వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో నిబంధనల మేరకు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఏడాది పాలన, ప్రగతి పధకాలపై ఇప్పటికే ప్రభుత్వం వారం రోజుల (23 నుంచి 30 వరకు) కార్యకలాపాలకు రూపకల్పన చేసింది. దానికి అనుగుణంగా మీరు కార్యక్రమాలు నిర్వహించాలని రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు, నాయకులకు పిలుపునిచ్చారు.   

Back to Top