వర్రా కేసులో పోలీసుల అత్యుత్సాహం..

ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్

 వైయ‌స్ఆర్ జిల్లా:   వైయ‌స్ఆర్ సీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టు వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు.  ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు సెర్చ్ వారెంట్ అంటించారు. జిల్లా సోషల్ మీడియా యాక్టివిస్టులకు 41ఏ నోటీసులు అందించారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నాయకురాలు సునీత రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె ఇంట్లో లేకపోవడంతో 41ఏ నోటీసులు అంటించారు. 

  
సుందర్‌ కుమార్‌ అక్రమ అరెస్ట్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల వేధింపుల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనుదుర్రుకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, న్యాయవాది గొర్రుముచ్చు సుందర్ కుమార్‌ను ఇవాళ‌ తెల్లవారుజామున  అరెస్ట్ చేశారు. ఇటీవలే అతనిని జిల్లా అధికార ప్రతినిధిగా వైయ‌స్ఆర్‌సీపీ ప్రకటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సుందర్ కుమార్‌పై కూట‌మి ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగింది.  ఉండి పోలీస్ స్టేషన్‌లో సుందర్ కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. 

Back to Top