లోకేష్ ..అవినీతిలో నిండా మునిగిన నువ్వా నీతులు చెప్పేది

వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త విశ్వేశ్వ‌ర‌రెడ్డి

 పయ్యావుల కేశవ్ ను చూస్తే పిట్టలదొర గుర్తుకొస్తున్నాడు
  
పేదలకు దొంగపట్టాలు పంచి మోసం చేసిన ఘనుడు

చెరువులకు నీరు విడుదల పేరుతో రైతుల మధ్య చిచ్చు పెట్టాడు
  
 ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా ఛీ కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయి

 

 ఉరవకొండ: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లోకేష్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని, అవినీతిలో నిండా కూరుకుపోయిన నువ్వా మాకు నీతులు చెప్పేది అంటూ నారా లోకేష్ పై ఉరవకొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. కూడేరు పాదయాత్రలో అవాకులు చవాకులు పేలిన నారా లోకేష్,  ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా లోకేష్, పయ్యావుల మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండలో మీడియాతో మాట్లాడారు.  లోకేష్ తన యువగళంలో ఏదీపడితే అది మాట్లాడుతున్నారని, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను పట్టుకుని స్కామ్ మోహన్ రెడ్డి అని పిలవడాన్ని ఆయన తప్పు పట్టారు. లోకేష్‌  నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ లకు ఆద్యుడు నీ బాబు చంద్రబాబని అన్నారు.రాజధాని నిర్మాణం పేరుతో అమరావతిలో ముందుగానే భూములు కొని నువ్వు నీ పయ్యావుల కేశవ్ లాంటివారు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడాలని ఆరోపించారు.అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని కైవసం చేసుకుంటున్నారని, భాధితులకు న్యాయం చేస్తామని కాకమ్మ కథలు చెప్పి ఆ ఆస్తులు కొట్టేసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి అయిన లోకేష్ డేటా స్కామ్ లోను , స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో వందల కోట్ల రూపాయలు కొట్టేసాడని అన్నారు.నీ స్కాములు చూసి ప్రజలంతా లోకేష్ అని పిలవకుండా  లోకేస్కాము అని అంటున్నారని పేర్కొన్నారు.చిన్న వయసులోనే ఇన్ని అక్రమాలకు పాల్పడిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. ఇక పయ్యావుల కేశవ్ పిట్టలదొరలా మాట్లాడుతున్నాడని కేంద్ర ప్రభుత్వం చేసిన వాటిని, తమ ప్రభుత్వం చేసిన వాటిని కూడా తానే చేశానని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఉరవకొండ పట్టణంలో నాడు ఓట్ల కోసం ప్రజలకు దొంగ పట్టాలను పంచిన ఘనుడు పయ్యావుల కేశవ్ అని ఆయన విమర్శించారు.చెరువులకు నీళ్లు విడుదల పేరుతో నాడు చోళసముద్రం,ఇప్పేరు, లత్తవరం వద్ద ఆయా గ్రామాల రైతుల మధ్య చిచ్చు పెట్టాడన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పరిహారం అందించి ప్రశాంతత నెలకొనేలా చేశామన్నారు.ఉరవకొండ నియోజకవర్గంలో గాలిమరల ఏర్పటు సందర్భంగా రైతుల నుండి భూ సేకరించే క్రమంలో పయ్యావుల సోదరులు కొందరు బ్రోకర్ల ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు. నాడు నీ పక్కన తిరిగే పైసాకు తరం కానీ కొందరు వ్యక్తులు నేడు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని కేశవ్ ను ప్రశ్నించారు. హంద్రీనీవా కెనాల్ ను నాడు వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తే అది మీ గొప్పతనం గా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. మొదటి దశలోనే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం జీడిపల్లి వరకు నీళ్లు తెచ్చిందని తర్వాత మీరేం చేశారని అడిగారు. మీ ఐదేళ్ల పాలనలో ముంపు బాధితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇప్పించలేక పోయారన్నారు.మీ పాపాల వల్లే నేటికి పరిహారం అందలేదని చెప్పారు.నాడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించి తర్వాత ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా వెళ్లిపోయిన మీరు ఈరోజు ఆ నెపాన్ని మాపై వేయడం దారుణమన్నారు.మా ప్రభుత్వ హయాంలో రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్, రాగులపాడు వద్ద డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభమయ్యాన్నారు.హంద్రీనీవా నుంచి జిల్లా కు అత్యధికంగా నీరు తెచ్చామన్నారు.మీ లాగా రైతాంగాన్ని మోసం చేయలేదన్నారు.మీ పాదయాత్రలో ఉన్నవి లేనివి చెబుతూ అవాకులు, చవాలుకు, మోసం మాటలతో ప్రజలను నమ్మించలేరన్నారు.ఇప్పటికైనా మీరు మారకపోతే ప్రజలు శాశ్వతంగా ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న , కరణం పుష్పావతి, తేజోనాథ్, నరసింహులు, జోగి వెంకటేష్,ఏసీ ఎర్రిస్వామి, వెంకటరెడ్డి,అశోక్ కుమార్, సుంకన్న,లింగన్న తదితరులు పాల్గొన్నారు.

Back to Top