దుగ్గిరాల ఎంపీపీగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

 గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్‌ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నించింది. దీనిపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి టీడీపీలో బీసీ మహిళ లేకపోవడంతో ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఏక‌గ్రీవంగా ఎన్నికైన రూప‌వాణిని ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అభినందించారు.

తాజా వీడియోలు

Back to Top