పెద్దిరెడ్డిపై పనిగట్టుకుని అసత్య కథనాలు

వివరణ ఇచ్చినా విషం చిమ్ముతూనే ఉంది!

వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఫైర్‌

తిరుపతి: వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ అనుకూల మీడియా ఇస్తున్న కథనాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పని గట్టుకుని ఈ విష ప్రచారం చేయిస్తోందని ఫైర్ అయ్యారు. గురువారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని ఎల్లో మీడియా ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విష ప్రచారం చేస్తోంది. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా ఉద్దేశ్య పూర్వకంగా మీ రాసిన చెల్లుతుంది విషం చిమ్ముతున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  పైన పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తున్నారు. తప్పుడు కథనలుపై  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారు. 

పెద్దిరెడ్డి క‌డిగిన ముత్యం:
ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యంలా బయట పడతారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు  ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకుండా మాపై విషం చిమ్ముతున్నారు. ఎల్లో మీడియా పత్రికలు కనీసం వివరణ ఇచ్చినా పత్రిక విలువలు పాటించడం లేదు. కూటమి ప్రభుత్వం పై మా పోరాటం చేస్తూనే ఉంటాం , ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అనేది స్పష్టం అవుతోంది అని భూమన అన్నారు.

Back to Top