రైతులను మోసం చేసిన ఘతన చంద్రబాబుదే

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య
 

అమరావతి: రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సి.రామచంద్రయ్య విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబే అని మండిపడ్డారు.2004లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను చంద్రబాబు వ్యతిరేకించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు విధానం అందితే జట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు. మధ్యవర్తిత్వం కోసం తన బినామీలను, బ్రోకర్లను బీజేపీలోకి పంపారని దుయ్యబట్టారు. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుందని చంద్రబాబుకు రామచంద్రయ్య సలహా ఇచ్చారు.

Read Also: కేబినెట్‌ మీటింగ్‌.. కీలక నిర్ణయాలకు ఆమోదం

తాజా ఫోటోలు

Back to Top