మనది పేదల ప్రభుత్వం..పేదలకు అండగా ఉండే ప్రభుత్వం

వైయ‌స్ఆర్ వాహ‌న మిత్ర కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం

మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం

ఒక్కో డ్రైవర్‌కు ఇప్పటి వరకు రూ.40వేలు సాయం అందించాం

నాలుగు విడతల్లో వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లు పంపిణీ
 

ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదు

వాహన మిత్ర పథకం దేశంలో ఎక్కడా లేదు

నేను చూశాను..నేను విన్నాను..నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభించా

అబద్ధాలు చెప్పడంలో దుష్ట చతుష్టయాన్ని మించినవారు లేరు

నాకు ఉన్నది నిబద్ధత, నిజాయితీ, మీ తోడు, దేవుడి ఆశీస్సులు

 విశాఖ: మనది పేదల ప్రభుత్వం..పేదలకు అండగా ఉండే మీ జగనన్న ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. నేను చూశాను..నేను విన్నాను..నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభించానని చెప్పారు. అధికారంలోకి వచ్చచిన నాలుగు నెలల్లో వాహన మిత్ర పథకం కింద ఒక్కో డ్రైవర్‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేసినట్లు గుర్తు చేశారు. మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ  సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం కోరారు. విశాఖ‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ వాహ‌న మిత్ర ప‌థ‌కం ద్వారా నాలుగోవిడ‌త‌గా ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

 

 • ఈ రోజు దేవుడి దయతో వరుసగా నాలుగో ఏడాది కూడా వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ద్వారా అక్షరాల 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261.51 కోట్ల ఆర్థిక సాయం నేరుగా  ఇక్కడ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయడం చాలా సంతోషంగా ఉంది.
 • ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కా చెల్లెమ్మల‌కు, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అవ్వకు తాతకు .. చెరగని చిరునవ్వులతో మీరు చూపిస్తున్న ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 • నిజంగా ఒక ఆటో నడుపుతున్నా, లేదా ట్యాక్సీ నడుపుతున్న కుటుంబాలు తమకు తాము స్వయంగా ఉపాధి పొందుతూ..ఎవరి మీదా ఆధారపడకుండా తామంతట తామే తమ కాళ్లపై నిలబడుతూ..తమ కుటుంబాలను పోషించుకుంటూ స్వంత శక్తిపై ఆధారపడుతూ..ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఈ రోజు సొంత ఆటో, ట్యాక్సీ నడుపుతున్న డ్రైవర్‌ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు ఈ మూడేళ్ల కాలంలోనే రూ.1000 కోట్లకు పైగా, ఈ రోజుతో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.40 వేలు వారి ఖాతాల్లోకి జమ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వం, రాష్ట్ర, దేశ చరిత్రలో ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం మరొకటి లేదని సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇంతగా మీ బాగోగుల గురించి ఆలోచన చేసిన చరిత్ర ఎక్కడా ..ఎప్పుడు జరగలేదన్న వాస్తవం నిజమని ఈసందర్భంగా తెలియజేస్తున్నాను.
 • నా డ్రైవర్‌ సోదరులను ఆదుకుంటానని నా 3468 కిలోమీటర్ల పాదయాత్రలో..ఏలూరు వచ్చే సరికి ఆ రోజు నా వద్దకు ఆటో డ్రైవర్లు వచ్చి వారి కష్టాలు చెప్పారు. 
 • ఇన్సూరెన్స్‌ సొమ్ము కట్టకపోతే నాపై జరిమానాలు విధిస్తున్నారు. రోజుకు రూ.200, రూ.300 సంపాదించే మేము రూ.50, 100 చొప్పున జరిమాన చెల్లించాల్సి వస్తుందని నాతో చెప్పారు. నిజంగా బతకలేని పరిస్థితిలో ఉన్నామని నాతో చెబితే ఏలూరు సభలో ఆ రోజు నేను ఓ మాటిచ్చాను.
 • నేను అధికారంలోకి వచ్చిన తరువాత  ఇచ్చిన మాటను మరిచిపోలేదు. ఆ రోజు మీతో అన్న మాట..నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నానని చెప్పిన మాటకు అక్షరాల కట్టుబడి అధికారంలోకి వచ్చిన తరువాత సరిగ్గా నాలుగు నెలలకే ఆ మాట నిలబెట్టుకుంటూ ..మీ అందరి బాగోగుల కోసం వైయస్‌ఆర్‌ వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించాను.
 • కరోనా వచ్చిన కష్టకాలంలో మీకు తోడుగా నిలువవలసిన అవసరం ఎంతైనా ఉందని భావించా. ప్రభుత్వానికి ఆదాయం రాని పరిస్థితి ఉన్నా. మా ప్రభుత్వ కష్టం కన్నా..మీ ఇంట్లో మీ కుటుంబం పడుతున్న కష్టం ఎక్కువా అని భావించి నేరుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేశాం.
 • కరోకా కష్టకాలంలో నా అన్నదమ్ములైన డ్రైవర్లు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా నాలుగు నెలలు ముందుగానే వైయస్‌ఆర్‌ వాహన మిత్ర డబ్బులు మీ అకౌంట్లలో జమ చేశాం.
 • ఈ ఏడాది కూడా మూడు నెలలు ముందుగానే ఈ రూ.10 వేల ఆర్థిక సాయం చేయడం జరుగుతోంది.
 • మనది పేదల ప్రభుత్వం. ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. ఇది మీ జగనన్న ప్రభుత్వం..ఇది మీ ప్రభుత్వం అన్నది మరచిపోవద్దని సవినయంగా తెలియజేస్తున్నా.
 • అందుకే దాదాపు లక్షా 65 వేల కోట్ల రూపాయాలను ఈ మూడేళ్లలో నేరుగా బటన్‌నొక్కడం..నేరుగా మీ అకౌంట్లలోకి డబ్బులు వెళ్లిపోయాయి.
 • ఎక్కడా కూడా లంచాలు లేవు. వివక్ష లేదు. కులం, మతం, ప్రాంతం చూడలేదు. చివరకు పార్టీ కూడా చూడలేదు. నాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలని ఆదేశించా..నేరుగా లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.
 • ఇంతంటి సంక్షేమం, అభివృద్ధిని పేదవారికి ఇచ్చిన మన ప్రభుత్వం, గత ప్రభుత్వం తేడాను గమనించాలి.
 • గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ఉన్న తేడాను గమనించాలి. అప్పుడు, ఇప్పుడు  ఒకే బడ్జెట్‌. ఈ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయాడు. ఇప్పుడు మీ జగన్‌ ఎందుకు చేస్తున్నారో గమనించండి. 
 • చేసిన అప్పులు చూస్తే..lఅప్పటి ప్రభుత్వం కన్నా..ఇప్పటి మన ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా తక్కువే. అయినా వారు చేయలేకపోయారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఈ రోజు చేయగలుగుతోంది. 
 • కారణం అప్పుడు దోచుకో..పంచుకో..అప్పుడు దోచుకోవడంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, వీళ్లందరికీ తోడు  ఒక దత్తపుత్రుడు. అందరూ దోచుకోవడం, పంచుకోవడం. ఈ రోజు దోచుకోవడం లేదు. పంచుకోవడం లేదు. నేరుగా బటన్‌ నొక్కుతున్నాం. నేరుగా మీ చేతుల్లో డబ్బులు పెడుతున్నాం. తేడా గమనించమని కోరుతున్నా.
 • ఇది న‌లుగురు ధ‌నికులు..   మూడు చానల్స్, రెండు పత్రికలు, ఒక దత్తపుత్రుడు నిలువు దోపిడి కోసం నడిచిన ప్రభుత్వం కాదు. 
 • ఇది ఒకటిన్నర కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ కూడా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం అన్నది జ్ఞాపకంలో పెట్టుకోవాలని కోరుతున్నా..
 • ఇది అన్ని వర్గాల సామాజిక ప్రభుత్వం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదవర్గాల గురించి నిరంతరం ఆలోచన చేసే ప్రభుత్వం మీది, మనది అన్నది గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా.
 • ఈ రోజు ఇక్కడ వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ద్వారా వరుసగా నాలుగో ఏడాది మనందరి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం సామాన్యుడి పట్ల, సమాజం పట్ల మన బాధ్యత ఏ స్థాయిలో చేస్తున్నామో ఇది ఒక నిదర్శనం.
 • ఈ ఏడాది 2,61,516 మంది కుటుంబాలకు మంచి చేస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261 కోట్ల ఆర్థికసాయం చేస్తున్నాం.
 • సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్‌ అన్నదమ్ములకు ఇన్సూరెన్స్, ఫిట్‌నెన్స్‌ సర్టిఫికెట్లు లేకుండా, చలానాలు కట్టే పరిస్థితి రాకూడదు. 
 • డ్రైవర్లు క్షేమంగా ఉండాలని, వారిని నమ్ముకున్న ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ రోజు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ద్వారా ఆర్థికసాయం చేస్తున్నాం.
 • ఈ రోజు ఈ రూ.10 వేలు ఏ  అవసరానికి వాడుకుంటున్నారో నేను చూడటం లేదు. మీ మీద నమ్మకంతో మీకు ఇస్తున్నాను. ఒక్కటే మీకు చెబుతున్నాను. మీ వాహనాలకు సంబంధించి  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇన్సూరెన్స్‌ ఉండేలా చూసుకోండి. మీ వెనుక ప్రయాణికులు ఉన్నారు. వారి జీవితాలు కూడా మన చేతుల్లో ఉన్నాయన్న విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నా.
 • నేను అందిస్తున్న రూ.261.52 కోట్లతో పాటు గతంలో ఇచ్చిన సాయాన్ని కలుపుకుంటే అక్షరాల రూ.1026 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరికి రూ.40 వేల  దాకా ఇచ్చినట్లు అవుతుందని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను.
 • ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి. ఒక్కసారి గత పాలనను మనం గుర్తు చేసుకోవాలి.గత పాలనలో చంద్రబాబు హాయంలో ఈ ఫైన్ల రూపంలో ఆటో డ్రైవర్ల నుంచి 2014–2015లో రూ.6.50 కోట్లు గుంజారు. 2015–2016లో రూ.7.39 కోట్లు గుంజారు. 2016–17లో రూ.9.68 కోట్లు, 2018–18లో రూ.10.19 కోట్లు, 2018–19లో ఎన్నికలు ఉన్నాయని రూ.7 కోట్లు గుంజారు. గత ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.40 కోట్ల దాకా గుంజారు. 
 • ఆ రోజు పడిన ఇబ్బందులు, బాధలు గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బాధనిపిస్తుందో అదే మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత 2019–2020లో ఆటో డ్రైవర్ల వద్ద వసూలు చేసింది కేవలం రూ. 68 లక్షలు, 2020–21లో రూ.35 లక్షలు ..ఎక్కడా కోట్లలోవసూలు చేసే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లను ప్రోత్సహించడం, సహాయం చేయడమే మన ప్రభుత్వంలో చూస్తున్నాం. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం, ఇన్సూరెన్స్‌ కోసం ఎక్కడా  ఇబ్బందులు పడే పరిస్థితులు మన ప్రభుత్వంలో లేవు. డ్రైవర్లకు తోడుగా ఉంటూ నడిపిస్తున్నాం. ఎంత తేడా ఉందో గమనించండి.
 • ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే గోదారమ్మ ఉప్పొంగటం వల్లే కలిగే ఇబ్బందులను, కొన్ని గ్రామాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి, చర్యలకు ఆదేశించేందుకు ఇక్కడి నుంచి కాసేపట్లో ఏరియల్‌ సర్వేకు బయలుదేరుతున్నా..వెళ్లే ముందు ఒకటి రెండు అంశాలను రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి ఈ విషయాలపై తేడా గమనించాలని కోరుతున్నా..
 • ఈ మధ్యకాలంలో దుష్టచతుష్టయంగా తయారు అయ్యారు. ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరంతా తోడయ్యారు. అబద్ధాలు చెప్పడంలో, వక్రీకరించడంలో వీళ్లను మించిన వారు లేరు. నాకు వీళ్ల మాదిరి ఇన్నిన్ని టీవీ చానల్స్‌ లేవు, పేపర్లు లేవు. అబద్ధాలను చెప్పిందే చెప్పి నిజం చేసే గొప్పతనం నాకు లేదు. ఒక్కటే చెబుతున్నాను.
 •  నాకు వీళ్ల మాదిరి ఇవేవి లేకపోయినా..ఉన్నది ఒక్కటే ఒక్కటి నిబద్ధత, నిజాయితీ, మీ తోడు, దేవుడి ఆశీస్సులు అని కచ్చితంగా చెబుతున్నాను.
 • నేను ఆధారపడేది మీ మీద, దేవుడి దయపైనే. అంతేకాని పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు, దత్తపుత్రుడిపై కానే కాదని మరోసారి చెబుతున్నా.
 • మంచి జరగాలని, మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని, ఈ మంచితో మీ కుటుంబాలు ఇంకా అభివృద్ధిలో అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 •  
 • సీఎం వైయస్‌ జగన్‌ వరాల జల్లు

- ​విశాఖలోని హనుమంత్‌ వాక దగ్గర ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు
- విశాఖ ఈస్ట్‌ ప్రాంతంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు మరో రూ.25 కోట్లు మంజూరు
- మత్స్యకార సోదరులకు షెడ్స్‌ కూడా మంజూరు
- గతంలో కట్టుకున్న ఇళ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ఏదో ఒక విధంగా మంచి జరిగించేందుకు అడుగులు ముందుకు వేస్తానని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top