వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పంపిణీ

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ  ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ జయంతి సందర్భంగా జిల్లాలోని జమ్ములమడుగు పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవం కార్యక్రమంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛన్, వితంతువులు, వృద్ధులకు రూ.2,250 చొప్పున పింఛన్‌ను సీఎం చేతులు మీదుగా పంపిణీ చేశారు. గతంలో రూ.1000 పింఛన్‌ ఇస్తుండగా ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు ఆ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచారు. అది కూడా వైయస్‌ జగన్‌ పింఛన్‌ రూ.2 వేలు ఇస్తానని పాదయాత్రలో ప్రకటించిన తరువాత చంద్రబాబు పింఛన్‌ పెంచారు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారు.
 

Back to Top