ఈనెల 28న ‘వైయస్‌ఆర్‌ జలకళ’ ప్రారంభం

తాడేపల్లి: పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మరో హామీ అమలుకు రంగం సిద్ధమైంది. అన్నదాత సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేయిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయబోతున్నారు. ‘వైయస్‌ఆర్‌ జలకళ’ పథకాన్ని ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. ‘వైయస్‌ఆర్‌ జలకళ’ పథకం కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు కేటాయించింది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందనుంది.  ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్‌ రిగ్‌ వాహనాలను సీఎం 28వ తేదీన జెండా ఊపి ప్రారంభిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top