చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టింది

వైయస్ఆర్ సీపీ  ఎంపీలు  ఎన్. రెడ్డప్ప, వంగా గీత,  ఆదాల ప్రభాకర్ రెడ్డి,  గోరంట్ల మాధవ్,  తలారి రంగయ్య, చింతా అనురాధ, జి. మాధవి   

విభజన హామీల పట్ల కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది

 ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు వెంటనే నెరవేర్చాలి

 భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్రం తక్షణ సాయం విడుదల చేయాలి

 చంద్రబాబు బుద్ధి మారాలి.. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు మానుకోవాలి

 చేతికందిన కూడును నోటికి అందకుండా.. పేదల నోటికి, చేతికి చంద్రబాబు అడ్డుపెడుతున్నాడు

 జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు అంత ఉలుకెందుకు..?

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాతోపాటు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధ్వజమెత్తారు. మరో రెండేళ్ళలో విభజన హామీలు నెరవేర్చడానికి ఇచ్చిన కాలపరిమితి పూర్తికానుండటంతో వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు ఒకే తాటి మీద నిలబడాల్సిన అవసరం ఉందని, అలాకాకుండా, స్వార్థ రాజకీయాలే పరమావధిగా టీడీపీ,  రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి విమర్శలు చేయడం అంటే.. పేదవాడి పొట్టగొట్టడమేనని అన్నారు. ఎవరి వద్దా చేయి చాచకుండా,  పేదవాడు తలెత్తుకుని గౌరవంగా బతకడానికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిగారు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. వాటిని వృథా అనటానికి నోరు ఎలా వచ్చిందని వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ ఎంపీలు దుయ్యబట్టారు.  అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఓ వర్గం ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారే తప్పితే.. అందులో రాష్ట్ర ప్రయోజనాలు లేవని చెప్పారు. బుధ‌వారం న్యూఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో వైయస్ఆర్ సీపీ  ఎంపీలు  ఎన్. రెడ్డప్ప, వంగా గీత,  ఆదాల ప్రభాకర్ రెడ్డి,  గోరంట్ల మాధవ్,  తలారి రంగయ్య, చింతా అనురాధ, జి. మాధవి మీడియా సమావేశంలో  మాట్లాడారు.

*ఎంపీ శ్రీ ఎన్. రెడ్డప్ప మాట్లాడుతూ..*
- ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. విభజన జరిగిన 8 ఏళ్ళు పూర్తి కావొస్తున్నా కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం దురదృష్టకరం. 
- మరోవైపు ఇటీవల కురిన భారీ వర్షాలు, వరదల వల్ల ఆంధ్రప్రదేశ్ కు భారీగా నష్టం జరిగితే.. దానికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని మేం ఎప్పుడూ కోరుకోలేదు. తెలంగాణకు సాయం చేయడం కోసం మమ్మల్ని విడగొట్టి, దశాబ్దాల నుంచి వారసత్వంగా  వస్తున్న సంపద అంతా ఒక ప్రాంతానికే వెళ్ళి, ఆంధ్రప్రదేశ్  ప్రజలను ఒట్టి చేతులతో పంపించారు.
- ఒక్క చంద్రబాబు తప్పితే.. ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని ఎవరూ కోరుకోలేదు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి మరీ విడగొట్టమన్నది చంద్రబాబే. 
- ఈరోజు కేంద్రంలో మెజార్టీ ఉంది కదా అని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకోకపోవడం మంచిది కాదు. 
- ఇలానే వ్యవహరిస్తే..  భవిష్యత్తులో ప్రజలు తిరగబడే రోజులు కూడా వస్తాయి. మీ మాట నిలబెట్టుకుంటే.. కేంద్రం గౌరవం కాపాడుకోగలుగుతుంది. 
- రాష్ట్రానికి రావాల్సిని నిధులు అడుగుతుంటే.. ఎగతాళిగా మాట్లాడటం ఇకనైనా మానుకోండి.
- విభజన హామీలు నెరవేర్చాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ఢిల్లీ వచ్చారు, ప్రధానమంత్రితో సహా కేంద్రంలోని మంత్రులను కలిశారు. 
- ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజల పట్ల బాధ్యతతో 27 సంక్షేమ పథకాలను, డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చిన హామీలు ఏళ్ళు గడుస్తున్నా నెరవేర్చడంలేదు. 
- ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన డిమాండ్  ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంది. 
- విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు తప్పుడు విధానాలు, నిర్ణయాల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించింది.
- అమరావతి రాజధానిగా ఉండాలంటే.. 5 ఏళ్ళు అధికారంలో ఉండి చంద్రబాబు ఏం చేశాడు. ఎందుకు పక్కా భవనాలు కట్టలేదు..? - తాత్కాలిక రాజధాని పేరుతో 4-5 బిల్డింగులు కట్టాడు. 
- అమరావతి ప్రాంతంలో వంద అడుగుల లోతు తవ్వితే తప్పితే పిల్లర్లు నిలబడని పరిస్థితి. 
- అమరావతి రాజధాని పేరుతో తన సామాజిక వర్గానికి మేలు చేయడానికి, తన బినామీల భూముల ధరల కోసం బాబు రాజకీయం చేస్తున్నాడు తప్పితే అందులో రాష్ట్ర ప్రయోజనం ఏమీ లేదు.  
- చంద్రబాబు తప్పుడు నిర్ణయాల వల్లే నిజమైన అమరావతి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  చంద్రబాబు బుద్ధి మారాలి. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే కార్యక్రమాలను ఆయన విరమించుకోవాలి. 

*ఎంపీ శ్రీమతి వంగా గీత మాట్లాడుతూ.. 
- ఆంధ్రప్రదేశ్ కు న్యాయంగా దక్కాల్సిన హామీల అమలు, రావాల్సిన నిధులు, వివిధ సమస్యలు పరిష్కారం కోసం.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ ఎంపీలంతా అటు లోక్ సభలో.. ఇటు రాజ్యసభలో.. మా వాణిని గట్టిగా వినిపిస్తున్నాం.  రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళుతున్నాం. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల్ని, మంత్రుల్ని కలుస్తున్నాం. 
- వైయస్ఆర్సీపీలో కొంతమంది కొత్తవారు ఎంపీలు అయినప్పటికీ.. పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నాం. 
- రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీలు ఒక మాటమీద ఉండాలి. రాజకీయాలు ఉండేటప్పుడు ఎవరి ఎజెండా వారికి ఉండాలి. 
- పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విడదీసింది బీజేపీ-కాంగ్రెస్ పార్టీలే. వారి వల్ల జరిగిన అన్యాయానికి.. వారే బాధ్యత వహించి న్యాయం చేయాలి. 
- దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో కొవిడ్ రావడం, మరోవైపు అనుకోని వరదలు, భారీ వర్షాలకు జిల్లాలకు జిల్లాలు నష్టపోయాయి. ఆనకట్టలు సైతం కొట్టుకుపోయాయి. భారీ నష్టం వాటిల్లింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం. 
- కేంద్రం నుంచి రొటీన్ గా రావాల్సిన అంశాలను కూడా పెండింగ్ లో పెడుతున్నారు. 
- స్పెషల్ స్టేటస్, విశాఖ రైల్వే జోన్, పోలవరం అంశాలలో ఇంకా కేంద్రం నీళ్ళు నములుతుంది. 
- ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ లో పారదర్శకమైన పాలన చేస్తూ, ప్రతి పేదవాడు గౌరవంగా, తలెత్తుకుని బతికేలా చేస్తున్నారు. పేదవాడు ఎవరి గడప వద్ద చేయి చాచకుండా,  సిఫార్సుల కోసం ఎదురు చూడకుండా వారికి సంక్షేమ పథకాలను, వారి గడప వద్దకే తెచ్చి అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు. 
- మూడు రాజధానుల గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ.. మరి వారి మేనిఫెస్టోలోనే కర్నూలులోనే హైకోర్టు పెట్టాలని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చెప్పిన బీజేపీ నేతలే.. ఈరోజు మూడు రాజధానులకు వ్యతిరేకం అని ఎలా అంటారు. 
- అమరావతి రైతులపట్ల, వారి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రిగారు సిద్ధంగా ఉన్నారు. రైతుల వెనుక ఉన్న రాజకీయం ఏంటో అందరూ చూస్తున్నారు. 
- విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగేలా, పార్టీలకు అతీతంగా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. 
- ఏపీ ప్రతిష్టను భంగపరిచేలా టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదు. 
- విచ్చలవిడిగా సంక్షేమం ఇస్తున్నాం అని మాట్లాడుతున్న ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్నాం..  పేదలకు, రైతులకు, చేనేతలకు.. ఇలా సమాజంలో అణగారిన వర్గాలకు మేలు చేయడం వల్ల నష్టం జరుగుతుందా..?
- ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో..  పేదవాడు చేయి చాచడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సింది నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే జగన్ మోహన్ రెడ్డిగారికి శ్రీరామ రక్ష. 
- ఏపీ కూడా భారతదేశంలో భాగమే.  ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క బీజేపీకే కాదు.. భారతీయులందరికీ ప్రధాని. ఇప్పటికైనా, ఆంధ్రప్రదేశ్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి అని ప్రధానమంత్రిగారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. 
- ఒక టార్గెట్ పెట్టుకుని ప్రధానమంత్రిగారు అయోధ్య రామాలయ నిర్మాణం, కాశీ విశ్వనాథుని ఆలయం సుందరీకరణ పనులు ఏలా అయితే చేస్తున్నారో.. అలానే పోలవరం కూడా నిర్మించండి అని కోరుతున్నాం. 

*ఎంపీ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..
- గత వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల తుపాను ప్రభావం నాలుగు జిల్లాల మీద విరుచుకపడటం, పెన్నా పరివాహక ప్రాంతమైన అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 1400 గ్రామాలు దెబ్బతిని, 2 లక్షల మంది జనాభా వరదల బారిన పడ్డారు.  41 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. దాదాపు రూ. 6 వేల కోట్లకు పైగా నష్టం సంభవించింది. 
- వరద నష్టానికి సంబంధించి తక్షణ సాయం చేయాలని గత నెల 23వ తేదీన సీఎం గారు ప్రధానికి లేఖ రాశారు. ఫోన్ లో కూడా ప్రధానితో సంభాషించారు, తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వమని అడిగారు. ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు. 
- పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి గారిని కూడా కలిసి విన్నవించాం. కేంద్ర బృందం నుంచి నివేదిక రాగానే నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.
- గత ఏడాది వరద నష్టాలకు సంబంధించి అక్టోబరు నెలలో రూ. 800 కోట్లు కేంద్రం ఇచ్చింది తప్పితే.. ఇప్పుడు వచ్చిన వరదలకు ఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేదు. 

*ఎంపీ శ్రీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ..
-  చేతికందిన కూడును నోటికి అందకుండా.. పేదల నోటికి, చేతికి చంద్రబాబు అడ్డు పడుతున్నారు. 
- విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రుకి మాట్లాడే స్వేచ్ఛ లేదా.. ఆయన స్వేచ్ఛను హరించడానికి చంద్రబాబు ఎవరు...?  ఓడిపోయి ఇంట్లో కూర్చున్న చంద్రబాబు మాత్రం ఏమైనా మాట్లాడవచ్చా.. చంద్రు గారు ఈ దేశ  పౌరుడు కాదా..? ఆయన మాటలకు చంద్రబాబు, అండ్ బ్యాచ్ కు ఉలుకెందుకు..?
- రాష్ట్రంలో అడుగడుగునా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఏరకంగా సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారో గమనిస్తున్నాం. 
- పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను వారికి  చేరనివ్వకుండా, చంద్రబాబు దుర్బుద్ధితో  ఏ విధంగా చిచ్చు పెడుతున్నారో చూస్తున్నాం. 
- వరుసగా అన్ని ఎన్నికల్లో తనను ప్రజలు ఛీత్కరించారన్న కక్షతో, చంద్రబాబు ప్రజలపై కక్ష సాధింపు ధోరణలో పనిచేస్తున్నాడు.
- సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే కార్యక్రమాన్ని చంద్రబాబు ఇప్పటికైనా మానుకుని, జనంలోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందాలి..

*ఎంపీ శ్రీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ఏమన్నారంటే..*
- రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాండిచ్చేరి ఎన్నికల సమయంలో వారికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మిగతా రాష్ట్రాలు అడిగితే మాత్రం 14వ ఆర్థిక సంఘం వద్దన్నది కాబట్టి, భవిష్యత్తులో ఎవరికీ ఇవ్వటం లేదు కాబట్టి, ఏపీకి ఇవ్వటం లేదు అని చెబుతారు. 15వ ఆర్థిక సంఘం కూడా.. ప్రత్యేక హోదా అన్నది తమ పరిధిలోకి రాదు, ఇది పూర్తిగా కేంద్రం పరిధిలోనిది, ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు అని చెప్పింది.
- సాక్షాత్తూ రాజ్యసభలో ఫిబ్రవరి 20, 2014లో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాను ప్రకటించారు. ఆనాడు దానికి బీజేపీ కూడా మద్దతు  ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి విభజన చట్టాన్ని బహుశా మొట్టమొదటిసారి ఏకాభిప్రాయంతో అంగీకరించాయి. వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వీరిదే. 
- ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి రాజధాని నగరాన్ని ఏపీ కోల్పోయింది కాబట్టి, ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరుతున్నాం. 
- ప్రత్యేక హోదా అన్నది క్లోజింగ్ చాప్టర్ కాదు. అది మరుగున పడలేదు. ప్రత్యేక హోదా కోసం మేం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం తలచుకుంటే ఇవ్వొచ్చు. 
- రాష్ట్రంలో ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయి, రెవెన్యూ లోటు ఎక్కువ ఉంది. పరిశ్రమలు లేవు, సిటీలు లేవు. వాస్తవానికి, ఒక్క సంక్షేమ పథకాల అమలు చేయడం వల్లే ఏపీలో ఒక పండగ వాతావరణం ఉంది.
- పేదలకు ఇచ్చేది వృథా అనడం ప్రతిపక్షాలకు మంచిది కాదు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా.. ? 
- పార్టీ ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ మాట్లాడాలి. 

ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ..  విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నారు. అలానే పెండింగ్ నిధులను తక్షణం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. 

ఎంపీ శ్రీమతి జి. మాధవి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో, సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించడం గిరజనుల విజయంగా తెలిపారు. దీనివల్ల 
గిరిజనుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, విద్యా, వైద్య రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందుతారన్నారు.

తాజా వీడియోలు

Back to Top