హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్ సీపీ భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాలోని జోహెనస్‌బర్గ్‌లో ఆదివారం వైయస్ఆర్ సీపీ విజయోత్సవ సభను నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు ఉదయం 10 గంటలకు కారు ర్యాలీని నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. దక్షిణ్ ఇండియన్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ వేడుకలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ కేక్‌ను కట్ చేసి జై వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా వైయస్ఆర్ సీపీ నాయకులు కల్ల నరసింహారెడ్డి, సూర్య రామిరెడ్డి, వెంకట్ మాగంటి, విక్రమ్ కుమార్ పెట్లూరు, మోహన్, దినేశ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.