3న నెల్లూరుకు వైయ‌స్‌ జగన్ 

మాజీ మంత్రి కాకాణికి పరామర్శ 

నెల్లూరు : మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ జూలై 3న నెల్లూరు రానున్నారు. సెంట్రల్‌ జైల్‌లో ఉన్న మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ములాఖత్‌లో పరామర్శిస్తారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 
ఆదివారం నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో వైయ‌స్‌ జగన్‌ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకాణిని కలిసిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కూడా వైయ‌స్‌ జగన్‌ పరామర్శిస్తారని తెలిపారు.  

Back to Top