వైయస్‌ఆర్ జిల్లా: తిరుపతి నుంచి కడప చేరుకున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు,దర్గా పీఠాధిపతి ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్‌కు దర్గా పీఠాధిపతి సంప్రదాయ తలపాగా చుట్టారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.దర్గాలో వైయస్ జగన్ చాదర్ సమర్పించారు.వైయస్ జగన్ వెంట వైయస్‌ఆర్‌సీపీ నేతలు విజయసాయిరెడ్డి,అవినాష్‌రెడ్డి,మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.