రేపు కడప దర్గాను దర్శించుకోనున్న వైయస్ జగన్

విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ‌ తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వైయ‌స్ జగన్ అక్కడి నుంచి కడపకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 11.30కి కడప పెద్దదర్గాను దర్శించుకోనున్నారు. అనంతరం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేయనున్నారు. ఆ తరువాత ఇడుపులపాయలో వైయ‌స్‌ సమాధి వద్ద వైయ‌స్‌ జగన్‌ నివాళులర్పించనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top