నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్‌ (వయా - తాళ్ళపాలెం జంక్షన్‌, కొత్తూరు జంక్షన్‌, పెందుర్తి, వేపకుంట, ఎన్‌ఏడీ జంక్షన్‌)కు చేరుకుంటారు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఇవాళ‌(అక్టోబ‌ర్‌9)న‌ అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. గురువారం ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్‌, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్‌, తాళ్ళపాలెం జంక్షన్‌) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్‌ (వయా - తాళ్ళపాలెం జంక్షన్‌, కొత్తూరు జంక్షన్‌, పెందుర్తి, వేపకుంట, ఎన్‌ఏడీ జంక్షన్‌)కు చేరుకుంటారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు.

Back to Top