మాఫియా సామ్రాజ్యం

పిడుగురాళ్ల స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఎన్నికలు వచ్చే సరికి వీళ్లకు ప్రజలు గుర్తుకు వస్తారు

నియోజ‌క‌వ‌ర్గంలోని 70 గ్రామాల్లో నీటికి క‌ట‌క‌ట‌

మైనింగ్‌ మాఫియాలో చిన‌బాబు, పెద్ద‌బాబుల‌కు వాటాలు

 మన పథకాలను కాపీ కొడుతూ.. అన్నదాత సుఖీభవ అంటూ దొంగ పథకాలు

 నిరుద్యోగ భృతి కింద ప్ర‌తి కుటుంబానికి రూ. 1.20 లక్షలు బాకీ

మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

 

గుంటూరు:  రాష్ట్రంలో ఐదేళ్లుగా మాఫియా సామ్రాజ్యం న‌డుస్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ఇసుక‌, మ‌ట్టి, బొగ్గు, క‌రెంటు కొనుగోలు మొద‌లు భూములు కూడా వ‌ద‌ల‌డం లేద‌ని విమ‌ర్శించారు. మైనింగ్ మాఫియాలో చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడికి వాటాలు ఉన్నాయ‌న్నారు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలోని 70 గ్రామాల్లో తాగేందుకు నీరు లేక ప్ర‌జ‌లు అల్లాడుతుంటే ఈ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్లు కూడా లేద‌ని మండిప‌డ్డారు. పిడుగురాళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.  

ఐదేళ్లు ప‌ట్టించుకోలేదు..
పక్కనే నాగార్జున సాగర్‌ కనిపిస్తుంది. కానీ తాగడానికి నీరు కనిపించవు. ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలనలో తాగడానికి నీళ్లు కూడా అందడం లేదు. కానీ, ఎన్నికలు ఉన్నాయంటే మాత్రం ఎన్నికలు ఒక నెల ముందు చంద్రబాబు కొడుకు వస్తాడు.. నారా లోకేష్‌ వచ్చి బుగ్గవాగు నుంచి కృష్ణా జలాలు ఇస్తున్నానని ఒక కొబ్బరికాయ కొడతాడు. ఐదు సంవత్సరాలు పట్టించుకోరు. ఎన్నికలు వచ్చే సరికి వీళ్లకు ప్రజలు గుర్తుకు వస్తారు. తాగడానికి నీరు లేదని గుర్తుకు వస్తుంది. ఎలాంటి దారుణమైన పాలన జరుగుతుందో ఆలోచన చేయండి. ఇదే గురజాల నియోజకవర్గంలో రైతులకు తాగడానికి మంచినీరు, పంటలకు సాగునీరు ఉండదు. అరకొరగా పంటలు పండితే ఆ పంటల పరిస్థితి పత్తికి కనీస మద్దతు ధర రూ. 5,450 అయితే కనీసం రూ. 5 వేలకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. మిర్చి పంటకు క్వింటాల్‌కు రూ. 10 వస్తే ఖర్చు తీరుతాయని అనుకుంటే కనీసం రూ. 6 వేలు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గంలో తాగడానికి నీరు లేక 70 గ్రామాలు అలమటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నా.. కనీసం పట్టించుకునే దిక్కు లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. 

మైనింగ్ పేరుతో దోపిడీ
పిడుగురాళ్ల పట్టణంలో లక్షమందికిపైగా జనాభా ఉన్నా.. కనీసం వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి కూడా లేని పరిస్థితి. ఎవరికైనా యాక్సిడెంట్, పెద్ద ఆపరేషన్‌ చేయాల్సి వస్తే గుంటూరుకు వెళ్లాల్సిన దుస్థితి. గుంటూరుకు వెళ్లేలోపు ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. గురజాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి యరపతినేని అనే దిక్కుమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు.. యరపతినేని మైనింగ్‌ వ్యాపారం పేరుతో అక్షరాల గనులను దోపిడీ చేస్తున్నాడు. కోర్టులు సైతం మైనింగ్‌ మాఫియా జరుగుతుందని రూ. వంద కోట్ల జరిమానా విధించాయి. ఇంత దారుణంగా మైనింగ్‌ మాఫియా జరుగుతుంటే అరికట్టాల్సిన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు, ఇదే ఎమ్మెల్యేతో భాగాలు పంచుకుంటున్న అధ్వాన్నమైన పరిస్థితి చూస్తున్నాం. రూ. 100 కోట్లు రికవరీ చేయాలని కోర్టు ఆదేశిస్తే.. తన జేబులో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తున్నాడు. ఆ సీఐడీ వాళ్లు యరపతినేని నుంచి వసూలు చేయకుండా చిన్న చిన్న మైనింగ్‌ మిల్లులకు నోటీసులు పంపిస్తూ.. కోటి, రెండు కోట్ల రూపాయలు కట్టాలని నోటీసులు పంపిస్తున్నారంటే.. దొంగతనం చేసిన వాడిని వదిలేస్తున్నారంటే.. ఇంతకంటే మాఫియా సామ్రాజ్యం ఎక్కడైనా ఉందా.. 

ఐదేళ్ల‌లో మోసం..మోసం..మోసం
చంద్రబాబు హయాంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు, రౌడీయిజం జరుగుతుందంటే.. సినిమా థియేటర్‌ యజమానులు కూడా ఈ రోజు కప్పం కట్టకపోతే మూసివేయించే అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో క్లబ్‌లు, గ్రనైట్‌ ఆక్రమణ క్వారీలు, మైనింగ్‌ అక్రమ మాఫియా, దారుణంగా రౌడీ రాజ్యం, ఒక మాఫియా రాజ్యం కొనసాగుతుంది. ఇంతటి దారుణంగా ఇక్కడ గురజాలలో పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఐదేళ్లలో మోసం.. మోసం.. మోసం అనే పదాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మోసం, అబద్దాలు, అవినీతి, అన్యాయం, అధర్మం అనే పదాలు కనిపిస్తాయి. చంద్రబాబు పాలన ఒక్కసారి చూడాలని అభ్యర్థిస్తూ.. 

మన వాగ్దానాలు మనం చేశాం. 21 నెలల కిందట మన పార్టీ ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించాం. ప్రతి పేదవాడికి మంచి చేయడం కోసం నవరత్నాలను పాదయాత్ర ద్వారా ప్రతి రైతన్న, ప్రతి పేదవాడి దగ్గరకు తీసుకెళ్లాం. నవరత్నాల్లో పేదవారు ఇచ్చిన సలహాలు, సూచనలు తీసుకుంటూ నవరత్నాల్లో మార్పులు చేస్తూ నవరత్నాలను మెరుగుచేశాం. చంద్రబాబు చేస్తున్న వాగ్దానాలు భయం నుంచి పుట్టాయి. బాబు వాగ్దానాలు ఐదు సంవత్సరాలు మోసం చేసిన తరువాత మళ్లీ మరో ఐదేళ్లు మోసం చేసేందుకని కనిపిస్తున్నాయి. చంద్ర‌బాబు మాటలు నమ్మి సర్వం పోగొట్టుకున్న రైతన్నకు మేలు చేయడం కోసం రూ. 50 వేలు పూర్తిగా చేతికే ఇస్తామని, అప్పులకు సంబంధం లేకుండా ఇస్తామని మనం 21 నెలల కిందట, దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వాగ్దానం చేశాం. కానీ చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో రైతులను మోసం చేసిన తరువాత మళ్లీ రైతులను మోసం చేసేందుకు ఎన్నికలకు మూడు నెలల ముందు మన పథకాలను కాపీ కొడుతూ.. అన్నదాత సుఖీభవ అంటూ దొంగ పథకాలను ప్రవేశపెడుతున్నాడు. 

ప‌సుపు-కుంకుమ పేరుతో సినిమా..
చంద్రబాబు మాటలు నమ్మి పూర్తిగా నష్టపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల పరిస్థితి చూసి వారికి  అండగా ఉంటేందుకు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల తేదీ వరకు ఉన్న రుణాలన్నీ నాలుగు దఫాలుగా నేరుగా వారికి అందజేస్తామని ప్రకటించాం. 21 నెలల కిందట మనం ఆ మాట చెప్పి పాదయాత్ర చేస్తూ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నీ తమ్ముడు నీకు తోడుగా ఉన్నాడని భరోసా ఇస్తూ నడిచా.. కానీ చంద్రబాబు ఐదు సంవత్సరాలు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేసి, అన్యాయం చేసి సున్నావడ్డీ పథకం కూడా ఎగరగొట్టేసి అన్ని రకాలుగా నాశనం చేసి ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు – కుంకుమ అని మరో సినిమా చూపిస్తున్నాడు. మనం ఇస్తామన్న భయంతో చంద్రబాబు పసుపు – కుంకుమ పేరుతో ఈయన చూపిస్తున్న సినిమా.. చేసిన డ్రామా.. మూడు నెలల్లో ఇచ్చేది కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమే.. పొదుపు సంఘాల రుణాలు ఇవాల్టికి రూ. 28 వేల కోట్లు ఉన్నాయి. పూర్తిగా రుణాలు నేరుగా ఇస్తామన్న మనం ఎక్కడా.. ముష్టివేసినట్లుగా చంద్రబాబు ఇస్తున్న పసుపు – కుంకమ డబ్బులు ఎక్కడ. 

కుట్ర‌లు గ‌మ‌నించాలి
రాష్ట్రంలో అక్షరాల 1.75 కోట్ల ఇళ్లు ఉంటే ప్రతి ఇంటికి ఉద్యోగం, ఉపాధి ఇస్తానని, లేకపోతే రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. టీవీల్లో జాబు రావాలంటే బాబు రావాలని ప్రకటనలు ఇచ్చాడు. ఐదేళ్లు అవేవి చేయకుండా.. ఎన్నికలకు మూడు నెలల ముందు 1.75 కోట్లు ఇళ్లులు ఉంటే కేవలం 3 లక్షల మందికి ముష్టి వేసినట్లుగా రూ. వెయ్యి ఇచ్చేసినట్లుగా టీవీల్లో ప్రకటనలు ఇస్తున్న అన్యాయమైన పాలనను చూడండి. మోసం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలు గమనించాలి. 

చంద్రబాబు పాలన ఒక్కసారి గమనించండి
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాను సాధిస్తానని చెప్పి.. ఆ హోదాకు తూట్లు పొడిచి ప్రభుత్వంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ చెప్పినా.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రతి నిరుద్యోగిని మోసం చేశాడు. చంద్రబాబు పాలనలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే 1.40 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే కనీసం రూ. 15 వేలు ఆ ప్రతి కుటుంబానికి ఐదేళ్లలో రూ. 9 లక్షలు వచ్చి ఉండేవి. ఒక పక్కన నిరుద్యోగ భృతి అంటూ నెలకు రూ. 2 వేలు అంటూ 60 నెలల కాలంలో రూ. 1.20 లక్షలు ఎగరగొట్టాడు. ఐదేళ్లలో రూ. 9 లక్షలు సంపాదించుకునే పరిస్థితిని కాలరాశాడు. చంద్రబాబు పాలన ఒక్కసారి గమనించండి. ఎన్నికలు వచ్చే సరికి మోసం చేసేందుకు స్కీములు చెబుతాడు. చంద్రబాబు మోసాలకు వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 ఉన్నాయి. అమ్ముడుపోయిన ఎల్లోమీడియా వీరంతా కలిసికట్టుగా ఒక్కటై చేస్తున్న మోసాలను గమనించాలి. ఈ పెద్ద మనిషి నైజం ఏమిటో మీ అందరికీ తెలుసు. 

సంపూర్ణ మద్యనిషేదం పూర్తిగా ఎత్తేశాడు
1994లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం రూ. 2కే కిలోబియ్యం, సంపూర్ణ మద్య నిషేదం, హార్స్‌పవర్‌ విద్యుత్‌కు రైతులు చెల్లించాల్సింది కేవలం రూ. 50 అనే నినాదాలతో వచ్చారు. ఆ తరువాత 1995 వచ్చే సరికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తరువాత కిలో రూ. 2 బియ్యం రూ. 5.25 పైసలకు పెంచాడు. సంపూర్ణ మద్యనిషేదం పూర్తిగా ఎత్తేశాడు. రూ. 50కే హార్స్‌పవర్‌ రూ. 650కి తీసుకెళ్లాడు. చంద్రబాబు నైజం ఒక్కసారి చూడండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మళ్లీ జరిగిన అవే మోసాలు, అన్యాయాలను చూడండి. 

ప్ర‌తి ఒక్క‌రికి చెప్పండి..
చంద్రబాబు పాలనపై చర్చ జరగకూడదని, చర్చ జరిగితే డిపాజిట్లు కూడా టీడీపీకి రావని ప్రతి రోజు చంద్రబాబుకు అమ్ముడుపోయిన పత్రికలు, టీవీ చానళ్లు పుకార్లు పుట్టిస్తూ.. టీవీల్లో చర్చలు, పత్రికల్లో పతాక శీర్షికల్లో  బ్యానర్లు చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు పాలనపై చర్చ జరగకుండా మభ్యపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక వారంలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు చేయని కుట్ర ఉండదు. ప్రతి గ్రామానికి చంద్రబాబు మూటల మూటల డబ్బు పంపిస్తాడు. ప్రతి అక్క, ప్రతి అన్న, ప్రతి అవ్వతాతల చేతుల్లో రూ. 3 వేలు పెట్టి మోసం చేయడానికి కుట్ర చేస్తాడు. మీరంతా మీ గ్రామాలు, మీ వార్డుల్లోకి వెళ్లి ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి అవ్వాతాతలను కలిసి చంద్రబాబు మోసాలను వివరించండి. 

రూ. 3 వేలకు మోసపోవద్దు 
అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం
పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. ఆవరం రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. వారం రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 
ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. వారం రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

ఈ వ్యవస్థలోకి మార్పురావాలి.
నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసు మహేష్‌రెడ్డిని నిలబెడుతున్నాను. మీ ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణ దేవరాయలును నిలబెడుతున్నాను. వీరిద్దరిని ఆశీర్వదించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 

Back to Top