పొరుగు రాష్ట్రం కంటే వెయ్యి ఎక్కువే ఇస్తాం

కల్యాణదుర్గం సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అగ్రిగోల్డు బాధితులకు ఉపశమనం కలిగిస్తాం

అధికారంలోకి రాగానే అగ్రిగోల్డు బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు

జూనియర్‌ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు రూ.5 వేలు

సంఘమిత్రలు, వెలుగు యానిమేటర్లకు నెలకు రూ.10 వేల వేతనం

ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసేవారికి వడ్డీలేని రుణం

నాయీబ్రాహ్మణులు, రజకులకు ఏడాదికి రూ.10 వేలు

వారం రోజుల్లో ఎన్నికలున్నాయి, చంద్రబాబు కుట్రలు పెరుగుతాయి

అనంతపురం: ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వరాల జల్లు కురిపించారు. పొరుగు రాష్ట్రం కంటే గౌరవవేతనం వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు ప్రతి ఏటా రూ.10 వేలు చెల్లిస్తామని, ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని మాట ఇచ్చారు. వారం రోజుల్లో ఎన్నికలున్నాయని, చంద్రబాబు కుట్రలు పెరుగుతాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు.

  • ఇదే కల్యాణదుర్గంలో ఒకవైపు దివంగత నేత వైయస్‌ఆర్‌ పాలనలో జీడీపల్లి రిజర్వాయర్‌ నిర్మించి, కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత. కానీ టీడీపీ పాలనలో ఐదేళ్లుగా నియోజకవర్గంలోని 114 చెరువులు నింపేందుకు చేపట్టిన కాల్వ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సేకరించిన భూములకు ఇప్పటికీ రైతులకు పరిహారం ఇవ్వలేదంటే ఎంతదారుణంగా వ్యవస్థలను నడుపుతున్నారో ఆలోచన చేయండి. హంద్రినీవా ద్వారా పిల్ల కాల్వలు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయవచ్చు. ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన ఇప్పటి పాలకులకు లేదు.
  • ఇదే నియోజకవర్గంలో టమాట సాగు చేస్తారు. కానీ రైతులకు ఖర్చులకు రావడం లేదు. కిలో టమాట రూ.3.50 పడిపోయింది. సీజన్‌లో కేజీ రూపాయికి కూడా కొనే నాథుడు లేక రోడ్లపై వేసిన ఘటనలు చూశాం. రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. అరటి రైతులకు కేజీకి రూ.7 మించి రావడం లేదు.  ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకు మద్దతు ధర రావడం లేదు. పంటలు పండక కనీసం రెండు మూడు బస్తాలు కూడా రాని పరిస్థితిలో రైతు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశాం. 20 మంది ఇదే నియోజకవర్గంలో రైతులు చనిపోతే..ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 మంది మాత్రమే చనిపోయారని, వారిలో నలుగురికిమాత్రమే పరిహారం ఇచ్చారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడి పాలకులు రైతులకు మేలు చేయాలని, పేదవాడికి అండగా ఉండాలన్న ఆలోచన వీరికి లేదు. వీళ్ల ధ్యాసంతా ఒక్కటే వేదావతి నది నుంచి ఇసుక ఎలా దోపిడీ చేయాలన్నదే వీరి ధ్యాస.
  • ఈ ప్రాంతంపై టీడీపీ నేతల ప్రేమను చూడండి. కళ్యాణదుర్గంలో పేదల గుడిసెలు కూల్చివేశారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా వీరికి లేదు. వీళ్లు మనుషులేనా అని అడుగుతున్నాను.
  •  నా పాదయాత్ర 3648 కిలోమీటర్ల సాగింది. ఇదే జిల్లా గుండా పాదయాత్ర చేశాను. మీరు పడ్డ కష్టాలను విన్నాను. మీ బాధలు చూశాను. మీ అందరికి నేనున్నానని భరోసా ఇచ్చి చెబుతున్నాను. 
  •  పాదయాత్రలో ఇచ్చిన మాటలే ఇవాళ పునరుద్ఘటిస్తాను. అగ్రిగోల్డు బాధితులకు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క రూపాౖయెనా వచ్చిందా? ఆగ్రిగోల్డు ఆస్తులను తాను, తన కొడుకు, బినామీలు తక్కువ రేటుకు ఎలా కొట్టేయాలని దిక్కుమాలిన ఆలోచన చేశారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే..మొదటి బడ్జెట్‌లోనే రూ.1150 కోట్లు కేటాయించి బాధితులను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను.
  • ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులకు మాటిచ్చాను. మరొక్కసారి పునర్ఘటిస్తున్నాను. ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తాను. హోం గార్డులు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు జీతాలు పెంచాలని మొరపెట్టుకుంటుంటే చంద్రబాబు వారిని దారుణంగా అరెస్టు చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి కంటే మెరుగైన జీతాలు ఇచ్చారు. ప్రతి హోం గార్డు, అంగన్‌వాడీ కార్యకర్తకు, ఆశావర్కర్లకు చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం రాగానే మెరుగైనా జీతాలు ఇస్తామని, పక్క రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని హామీ ఇస్తున్నాను. సంఘమిత్రలు, యానిమేటర్లు, వీవోఏలకు చెబుతున్నాను. వారు బాగుంటునే పొదుపు సంఘాలు బాగుంటాయి. వారికి మంచి చేయాలని చంద్రబాబుకు ఏ రోజు తట్టలేదు. ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. మన ప్రభుత్వం రాగానే వారికి రూ.10 వేల వేతనం ఇస్తానని చెబుతున్నాను.
  • లా చదివిన లాయర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ప్రతి లాయర్‌కు అండగా ఉండేందుకు జూనియర్‌ లాయర్లందరికీ కూడా ప్రతి నెల రూ.5 వేలు సై్టఫండ్‌ ఇస్తామని, సంక్షేమ నిధికి డబ్బులు కేటాయిస్తానని మాట ఇస్తున్నాను. 
  • ఈ నియోజకవర్గంలో దారిపొడవునా చిరువ్యాపారులు ఉన్నారు. పుట్‌ఫాత్‌లో ఉన్న కులవృత్తుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేయాలని ఆలోచన రాలేదు. వారు పడిన ఆవేదన చూశాను. పెట్టుబడుల కోసం డబ్బులు కావాల్సి వస్తే రోజువారి వడ్డీలకు డబ్బులు తెచ్చుకుంటున్నామని చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. పుట్‌ఫాత్‌పై ఉండి వ్యాపారం చేసే వారికి గుర్తింపుకార్డులు ఇస్తాం. పేదవారందరికి కూడా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం ఇస్తామని చెబుతున్నాను. 
  •  ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్న వారు..సొంత ఆటోలు పెట్టుకొని బతుకుతున్న వారికి చెబుతున్నాను. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోవడంతో ^è ంద్రబాబు ప్రభుత్వం జరిమానా విధిస్తోంది. మీ కష్టాన్ని చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి చెబుతున్నాను. సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న ప్రతి సోదరుడికి ప్రతి ఏటారూ.10 వేలు ఇస్తామని చెబుతున్నాను.
  •  నాయిబ్రహ్మణులు, రజకులు, టైలర్ల గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. వీరికి మంచి చేయాలని చంద్రబాబు ఏ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. నా పాదయాత్రలో వీరి కష్టాలను చూశాను. వీరందరికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నాను. 
  •  నవరత్నాల గురించి ప్రతి సభలోనూ చెప్పుకుంటూ వస్తున్నాను. నవరత్నాలతో ప్రతి పేదవాడికి మంచి జరుగుతుందని చెబుతూనే వస్తున్నాను. మీ కష్టాలు తీరడానికి నవరత్నాలు ఎలా ఉపయోగపడుతాయో చెబుతున్నాను. చంద్రబాబు పాలనలో మనం మోసపోయాం. మోసాలు, అబద్ధాలు, అధర్మం, అవినీతి చూశాం. ఈ పాలనకు వ్యతిరేకంగా మార్పుకు ఓటు వేయమని కోరుతున్నాను.
  •  వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే పేపర్లు, చానల్స్‌ అమ్ముడుపోయాయి. ఇవాళ మనం చంద్రబాబు ఒక్కరితోనే కాదు..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడపోయిన చానల్స్‌తో యుద్ధం చేస్తున్నాం.
  •  ఎన్నికలప్పుడు ప్రతి గ్రామానికి మూటల కొద్ది డబ్బులు పెడుతున్నారు. ప్రతిచేతిలోనూ రూ.3 వేలు డబ్బులు పెడతారు. మీరంతా కూడా ప్రతి వార్డుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి. 
  • ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి.
  • ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి.  కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉషాశ్రీచరణ్, ఎంపీ అభ్యర్థిగా పీడీ రంగయ్యలను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
Back to Top