డైరెక్టర్‌..యాక్టర్‌ ఇద్దరూ కలిసి కుట్రలు

గాజువాకలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

చంద్రబాబు విశాఖను కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారు

షిప్‌యార్డు మూతపడకుండా కాపాడింది వైయస్‌ఆర్‌

మూతపడ్డ హెచ్‌సీఎల్, బీహెచ్‌ఈఎల్‌ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటా

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తా

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతా

 

గాజువాక: రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్‌ అయితే..పవన్‌ కళ్యాణ్‌ యాక్టర్‌ అని..ఈ ఇద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గాజువాకలో యాక్టర్‌కు..లోకల్‌ హీరో మధ్య పోరు జరుగుతుందని, లోకల్‌ హీరోకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనలో జాబులు రాలేదని మండిపడ్డారు.మూతపడిన హెచ్‌సీఎల్, బీహెచ్‌ఈఎల్‌ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాజువాకలో నిర్వహించిన ప్రచార సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

విశాఖపట్నం, గాజువాక గురించి మాట్లాడాల్సిన వచ్చినప్పుడు మీరు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి. వైయస్‌ఆర్‌ పాలించింది ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే. నాన్నగారు కేంద్రంతో పోరాడి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అడ్డుకున్నారు. విస్తరణకు నిధులు సేకరించారు వైయస్‌ఆర్‌. ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ విస్తరణ కార్యక్రమాలు నాన్నగారి హయాంలోనే జరిగాయి. మూతపడిన బీహెచ్‌సీఎల్‌ను విలీనం చేసి కొన్ని వందల కుటుంబాలను ఆదుకున్నారు. షిప్‌ యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి మూతపడకుండా కాపాడిన వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అని గుర్తు తెచ్చుకోండి. అచ్చుతాపురంలో ఎస్సీజెడ్, విశాఖ, దువ్వాడలో ఐటీ కారిడార్, పరివాడలో ఫార్మాసిటీని అన్నీ కూడా విశాఖపట్నానికి తీసుకొచ్చి కొన్ని వేల ఉద్యోగాలు వైయస్‌ఆర్‌ హయాంలో వచ్చాయని జ్ఞాపకం తెచ్చుకోండి. ఎయిర్‌పోర్టును ముప్పు నుంచి కాపాడి దాన్ని అంతీర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చారు. అంతకు ముందు విశాఖకు రావాలంటే.. వర్షం పడితే ఎయిర్‌పోర్టులో విమానాలు వెళ్లేవి కావు. 

ఐదేళ్లలో చంద్రబాబు విశాఖకు ఏం చేశారో బేరీజు వేసుకోండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్టీల్‌ ప్లాంట్‌ను అంబశయం మీదకు తీసుకెళ్లారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. విశాఖను కుంభకోణాలకు అడ్డాగా మార్చాడు. కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్‌ ఆస్తులు వదిలిపెట్టకుండా విచ్చలవిడిగా లక్షల కోట్ల రూపాయల అవినీతి, భూకుంభకోణాలు జరిగాయి. చివరకు ఆయన కొడుకును, వారి మంత్రులను, నాయకులను కాపాడుకునేందుకు వారి చేతుల్లో ఉన్న సిట్‌ విచారణ వేశారు. ఆ సిట్‌ ఇచ్చిన నివేదిక చెత్తబుట్టల్లో పడేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

విశాఖలో భూకుంభకోణాలు తన బినామీలకు కారుచౌకగా భూ కేటాయింపులు చేస్తాడు. బీచ్‌ రోడ్డులో అత్యంత విలువైన వెయ్యి కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఓ సంస్థకు ఫైస్టార్‌ హోటల్‌ కట్టుకునేందుకు ఇచ్చాడు. ఇదే విశాఖలో తక్కువ ఫైస్టార్‌ హోటల్స్‌ ఉన్నాయా..? అటువంటిది వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని అత్తగారి సొత్తులా చంద్రబాబు ధారాదత్తం చేస్తున్నాడు. ఇదే విశాఖలో సంవత్సరానికి ఒక రోజు భాగస్వామ్య సదస్సులు అని పెట్టాడు. మూడు సార్లు సదస్సులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాపై మోపిన భారం రూ. 150 కోట్లు ప్రజాధనం కొల్లగొట్టాడు. పాట్నర్‌ షిప్‌ సమ్మిట్‌లు పెట్టి 40 లక్షల ఉద్యోగాలు అన్నాడు.. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నాడు.. మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా..? రూ. 150 కోట్లు ఖర్చుపెట్టే శ్రద్ధ మోడీపై పెట్టి ఉంటే కేంద్రంలో తన పార్టీకి సంబంధించిన ఎంపీలు నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో కలిసి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు, మోడీ నాలుగు సంవత్సరాలుగా చిలక గోరింకలకు అసూయ పుట్టే విధంగా సంసారం చేశారు. ఆ నాలుగు సంవత్సరాల్లో ఇదే శ్రద్ధ నరేంద్రమోడీపై పెట్టి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది.. హోదాను తాకట్టుపెట్టకపోయి ఉంటే లక్షల్లో మన వాళ్లకు ఉద్యోగాలు వచ్చేవి కాదా చంద్రబాబూ.. 

ఇదే విశాఖలో ప్రత్యేక హోదాను అణచివేసిన సంఘటనలు చూశారు. సాక్షాత్తు విశాఖలో ప్రత్యేక హోదాకు అనుకూలంగా జగన్‌ అనే వ్యక్తి ప్రతిపక్ష నేతగా వచ్చి ధర్నాలో పాల్గొనడానికి వస్తే ఎయిర్‌పోర్టులోనే ఆపేసి ఏరకంగా ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కు పంపించింది విశాఖనగరంలోనే జరిగాయని గుర్తు చేసుకోండి. ఇదే విశాఖ నగరాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నాడంటే.. సాక్షాత్తు ప్రతిపక్ష నేతపై వీఐపీ లాంజ్‌లో కత్తితో దాడి చేయించే స్థాయికి తీసుకెళ్లాడు. వైయస్‌ఆర్‌ హయాంలో ఉరుకులు పరుగులు పెట్టిన ఐటీ రంగం చంద్రబాబు హయాంలో రివర్స్‌ గేర్‌లోకి వెళ్లింది. వైయస్‌ఆర్‌ హయాంలో అక్షరాల 16 వేల ఉద్యోగాలు ఉంటే అవి తగ్గి 12 వేలకు పడిపోయిన పరిస్థితులు బాబు పాలనలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీని ఏరకంగా అన్యాయమైన బాటలోకి నెట్టేశాడో మీరంతా చూస్తున్నారు. యూనివర్సిటీలో అధ్యాపకుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడం లేదు. యూనివర్సిటీకి డబ్బులు చెల్లించడం లేదు. పేదవాడు చదువుకునే పరిస్థితి ఉండకూడదని, చంద్రబాబు బినామీకి సంబంధించిన గీతంలోకి వెళ్లి చదువుకోవాలని చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూడండి. 

విశాఖపట్నానికి నిమ్స్‌ తరహాలు విమ్స్‌ అని పెట్టి వంద ఎకరాల్లో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అక్షరాల 1130 పడకల ఆస్పత్రిని నిర్మించడానికి రూ. 250 కోట్లు కేటాయించడం, పనులు ప్రారంభించడం చూశారు. 21 సూపర్‌ స్పెషల్‌ బ్లాక్స్‌కు గానూ.. ఇవాళ కేవలం 8 విభాగాలు మాత్రమే పనిచేస్తున్న అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ కేజీహెచ్‌ ఆస్పత్రి మీరంతా చూస్తున్నారు. ఎవరికైనా జబ్బు చేసి ఆస్పత్రికి వెళితే.. మంచానికి ఒక పేషంట్‌ ఉండాల్సిన చోట ఒకే మంచానికి ఇద్దరిని పడుకోబెడుతున్నారు. ఈ స్థాయిలోకి విశాఖను తీసుకెళ్లారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో స్థానికులకు ఉద్యోగాలు రాని పరిస్థితి. ఉక్కు నిర్వాసితులకు నాన్నగారి హయంలో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చారు. 16 వేల మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునే కార్యక్రమంలో ఇంకా 9 వేల మందికి ఉపాధి అందడం లేదు. 4 లక్షల జనాభా ఉన్న గాజువాకలో డంపింగ్‌ యార్డు సమస్య ఉంది. పెద్దగంట్యాడ నుంచి తరలించాలని అడుగుతున్నా.. పట్టించుకునే నాధుడే లేడు. పారిశ్రామికంగా గాజువాక ముందుంది. కానీ ఇక్కడ పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా లేదు. పాలిటెక్నిక్‌ కాలేజీ కట్టిస్తానని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చెబితే.. ఆ మాటకే దిక్కు దివానా లేదు. గాజువాకలో డిగ్రీ కాలేజీ లేదు. పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా లేని పరిస్థితుల్లో గాజువాక పరిస్థితి ఉంది. 

పారిశ్రామికంగా గాజువాక ముందడుగులో ఉంది. ఇక్కడకు రోజు కొన్ని వేల ట్రక్కులు వస్తాయి. ఇక్కడున్న పౌరులకు మేలు చేసేందుకు ఒక్క ట్రక్కు బే కూడా పెట్టలేని పరిస్థితుల్లో పాలన ఉంది. ఇదే విశాఖపట్నంలో చంద్రబాబు చేసిన అవినీతిని, వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిన అబివృద్ధిని బేరీజు వేసుకోండి. 

నా పాదయాత్ర 3648 కిలోమీటర్లు సాగింది. పాదయాత్ర మీ దీవెనలు, దేవుడి దయతో పూర్తి చేయగలిగాను. పాదయాత్రలో ఏ గ్రామానికి వెళ్లినా.. పే పట్టణానికి వెళ్లినా కూడా వినిపించిన సమస్య ఉద్యోగం లేదని వినిపిస్తుంది. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారో ఆలోచన చేయండి. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. రాష్ట్రం విడిపోయేటప్పుడు 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ చెప్పింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు.. ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ అవుతాయని ఉద్యోగాల కోసం కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి వేలకు వేల రూపాయలు తగలేస్తూ.. గత ఐదు సంవత్సరాలుగా చదువుతూనే.. ఉన్నారు. ఈ ఐదు సంవత్సరాల తరువాత అడుగుతున్నా.. కమల్‌నాథన్‌ కమిటీ చెప్పిన 1.40 లక్షల ఉద్యోగాలే కాకుండా ఐదేళ్లలో రిటైర్డ్‌ అయిన వారి ఉద్యోగాలు 90 వేలు. మొత్తం కలుపుకుంటే 2.30 లక్షల ఉద్యోగాలు.. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా.. అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా.. 

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని తెలిసినా కూడా.. అక్షరాల 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని కావాలనే భర్తీ చేయకుండా కుట్ర చేస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. టీచర్లను నియమించారు. సమయానికి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వరు. మధ్యాహ్న భోజన పథకానికి నెలల తరబడి సరుకుల బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారు. మన పిల్లలు ప్రభుత్వ బడులకు పోవడం వేస్టు అని మనం అనుకొని చంద్రబాబు బినామీ నారాయణ స్కూళ్లకు వెళ్లాలనే దిక్కుమాలిన ఆలోచనతో చంద్రబాబు ఉన్నాడు. ఆ నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీ చదవాలంటే రూ. 25 వేలు గుంజుతున్నారు. 

ఉద్యోగం, ఉపాధి ఇస్తానన్నాడు.. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అక్షరాల ఐదు సంవత్సరాల కాలం అంటే 60 నెలల్లో ప్రతి ఇంటికి చంద్రబాబు రూ. 1.20 లక్షలు ఎగ్గొట్టాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టాడు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా కోటి 70 లక్షల ఇళ్లు ఉంటే వాటిని మూడు లక్షలకు కుదించాడు. అది కూడా వెయ్యి రూపాయలు అంట. రూ. 1.20 లక్షలు ఇవ్వాల్సిన చంద్రబాబు కేవలం రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు వచ్చింది లేదు.. కానీ ఉద్యోగాలు పోయిన పరిస్థితి ఉంది. బాబు వచ్చాడు జాబు పోయిందనే మాట ప్రతి చోట వినిపిస్తుంది. బాబు వచ్చాడు 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద, గృహ నిర్మాణ శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 35 వందల మంది ఉద్యోగాలు గోవిందా.. వెయ్యి మంది గోపాలమిత్రల ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు ఆయుష్‌లో 8 వందల మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు సాక్షర భారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగాలు గోవిందా. బాబు వచ్చాడు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు ఉద్యోగాలు గోవింద.. కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న జీతాలు పెంచాలని అంగన్‌వాడీ, ఆశవర్కర్లు అడుగుతుంటే పోలీసులతో లాఠీచార్జి చేయించి కేసులు పెట్టిన పరిస్థితులు. 

ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నా.. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి నిరుద్యోగి పడుతున్న బాధలు చూశా.. పిల్లలకు ఉద్యోగాలు రాక తల్లిదండ్రులు పడుతున్న బాధలు విన్నా.. మీ అందరికీ నేను ఉన్నానని భరోసా ఇస్తున్నా.. మన ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత జగన్‌ అనే నేను ఉద్యోగాల కల్పన కోసం ఏం చేస్తానని చెబుతున్నా.. గవర్నమెంట్‌లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఒకే సారి విడుదల చేస్తామని హామీ ఇస్తున్నా.. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ వచ్చే సరికి ప్రభుత్వ ఉద్యోగాలు క్యాలెండర్‌ కూడా రిలీజ్‌ చేస్తాం. 

ఇవాళ మీకు ఎవరికైనా పెన్షన్, రేషన్, ఫీజురియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఇల్లు మంజూరు కావాలన్నా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా.. జన్మభూమి కమిటీలకు లంచం లేనిదే పని జరగడం లేదు. జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీకి ఓటు వేశారని మొట్టమొదటి ప్రశ్న వేస్తున్నారు. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ వార్డు సెక్రటేరియట్, గ్రామ సెక్రటేరియట్‌ తీసుకొస్తానని హామీ ఇస్తున్నా.. చదువుకున్న పది మంది పిల్లలకు మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాం. మీకు రేపు పెన్షన్, రేషన్, ఇల్లు మంజూరు, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్, నవరత్నాల్లో చెప్పిన ఏ పథకం కావాలన్నా.. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. అప్లికేషన్‌ పెట్టిన 72 గంటల్లోనే మంజూరు చేస్తాం. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని హామీ ఇస్తున్నా.. దీని వల్ల ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో పది మందికి స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్‌గా నియమిస్తా.. గౌరవ వేతనం కింద రూ. 5 వేలు ఇస్తాం. 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యతలను వలంటీర్లు తీసుకుంటారు.. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌తో అనుసంధానమై పనిచేస్తారు. ఏ పథకం కావాలన్నా.. వలంటీర్‌ తీసుకొని ఎవరిచుట్టూ తిరగాల్సిన పనిలేదు. నేరుగా బియ్యం దగ్గర నుంచి పెన్షన్‌ దగ్గర నుంచి నేరుగా మీ ఇంటికే డోర్‌ డెలవరీ చేయిస్తాం. 

ఇంకొక అడుగు ముందుకు వేస్తూ.. గవర్నమెంట్‌లో కాంట్రాక్ట్‌లు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, కార్లు అద్దెకు తీసుకోవడంలో కేశినేని ట్రావెల్స్, జేపీ బ్రదర్స్‌కు కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారు. ఇది పూర్తిగా మార్చేస్తాం.. బస్సులు, కార్లు అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి ఆదాయం వచ్చే ప్రతి కాంట్రాక్ట్‌ నిరుద్యోగ యువతకే వచ్చేలా చట్టాన్ని తీసుకువస్తాం. ఇంకో అడుగుముందుకు వేసి గవర్నమెంట్‌ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం. మన పార్టీ 25 ఎంపీ సీట్లు గెలుచుకోవాలి.. పక్క రాష్ట్రంలో 17 మంది ఎంపీలు కూడా మనకు మద్దతు ఇస్తామంటున్నారు. 42 మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కావాలని నినాదం తీసుకుంటారు. కేంద్రంలో ప్రధాని ఎవరైతారో తెలియదు.. సరైన సంఖ్య వచ్చే పార్టీలు కనిపించడం లేదు.. ప్రధాని ఎవరైనా హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామనే నినాదం అందుకుంటే హోదా వచ్చి తీరుతుంది. హోదా వస్తే.. ఇన్‌కం ట్యాక్స్, జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు కాబట్టి  పరిశ్రమలు, ఆస్పత్రులు, హోటళ్లు వస్తాయి. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఉద్యోగాల విప్లవం వస్తుంది. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నా.. ఇవన్నీ చేసే అవకాశం దేవుడు, మీరు నాకు ఇవ్వాలని కోరుతున్నా.. 
చంద్రబాబు కుట్రలు రోజూ చూస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ఆలోచన చేయండి. ప్రతి అడుగులోనూ.. మోసం అన్న పదాలే కనిపిస్తాయి. ఐదు సంవత్సరాల పాలనలో అన్యాయం, అబద్ధం, అవినీతి కనిపించాయి. ఇవాళ జరుగుతున్న యుద్ధం ధర్మానికి, అధర్మానికి జరుగుతుంది. చంద్రబాబు ఒక్కడితోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5తో యుద్ధం చేస్తున్నాం. అమ్ముడుపోయిన ప్రతి చానల్‌తో యుద్ధం చేస్తున్నాం. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేస్తున్న మోసాలు మీరంతా చూస్తున్నారు. ఎన్నిక రోజు వచ్చే సరికి ప్రతి వార్డుకు డబ్బులు పంపిస్తాడు.. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ వార్డుల్లోకి వెళ్లండి.. ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అవ్వను, ప్రతి తాతను, ప్రతి అన్నను కలవండి. 

అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. నాలుగు రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. నాలుగు రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత అనే మాటకు అర్థం రావాలి. మైక్‌ పట్టుకొని ఒక రాజకీయ నాయకుడు పలానా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న నాగిరెడ్డి అన్నపై ఉంచాలని కోరుతున్నా.. అదేరకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంవీవీ అన్న నిలబడుతున్నాడు.. మీ చల్లని ఆశీస్సులు ఇద్దరిపై ఉంచాలని కోరుతున్నా.. మన గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు.

గాజువాకలో పోటీ జరుగుతుంది.. యాక్టర్‌కు, లోకల్‌ హీరోకు మధ్య పోటీ జరుగుతుంది. ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండే నాగిరెడ్డి అన్న ఏ సమస్య వచ్చినా పలుకుతాడు. తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నాం. ప్రతి ధర్నా, ప్రతి నిరాహార దీక్ష చేశాడు. మీ కోసం కేసులు పెట్టించుకున్నాడు. కానీ, మరో వైపున యాక్టర్‌ ఉన్నాడు.. ఆయన నామినేషన్‌ వేస్తే తెలుగుదేశం జెండాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి కాపురం చేశాడు. ఎన్నికలకు సంవత్సరం ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నాడు. జగన్‌ అనే వ్యక్తి ఐదు సంవత్సరాలుగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. జగన్‌పై చంద్రబాబు 22 కేసులు పెట్టాడు. ఇదే యాక్టర్‌ అనే వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా బిల్డప్‌ ఇస్తే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారంతా కలిసికట్టుగా ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని అర్థం చేసుకోండి. 
 

Back to Top