బాబుకు మళ్లీ ఓటేస్తే ఇక వీరబాదుడు

దర్శి సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కనీస ధర రావట్లేదని కంది, శనగ, మినుము రైతులు వాపోతున్నారు

చంద్రబాబు పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాలేదు

వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని నాన్నగారు ఉరుకులు పరుగులు తీయించారు

బాబు పాలనలో ఉన్నత చదువుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి

బాబుకు మళ్లీ ఓటేస్తే కొండలు, గుట్టలు, నదులు ఏవీ ఉండవు, దోచేస్తారు

13 లక్షల మంది అగ్రిగోల్డు బాధితులకు ఉపశమనం కలిగిస్తాం

జడ్జీలుగా బీసీలు అనర్హులంటూ చంద్రబాబు లేఖ రాశారు

పాదయాత్రలో మీ కష్టాలు చూశాను..మీ అందరికి నేనున్నాను

 

ప్రకాశం జిల్లా: చంద్రబాబు పాలనలో ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, కుళ్లాయి పన్నులు బాదుడే బాదుడని..మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక S వీరబాదుడే అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 
ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

 • బాబు వచ్చాడు..ఈ జిల్లాకు ఏమిచ్చాడని అడుగుతున్నాను. బాబు వచ్చిన తరువాత ఐదేళ్ల కాలంలో నాగార్జునసాగర్‌ కుడికాల్వ కింద ప్రకాశం జిల్లాకు 60 టీఎంసీలు ఇవ్వాల్సి ఉండగా 20 టీఎంసీలకు మించి ఇచ్చారా అని అడుగుతున్నాను.
 •  బాబు వచ్చాడు..గిట్టుబాటు ధరలు పూర్తిగా నాశనం చేశారు. కంది ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి లేదన్నా..కనీసం రూ.4 వేలకు కొనే నాథుడు లేడన్నా అంటున్నారు. శనగ మద్దతు ధర రూ.5200 ఉంది..మాకేమో రూ.4000లకు మించి రావడం లేదని చెబుతున్నారు. మినుము రైతుల పరిస్థితి అలాగే ఉంది. ఆ రోజుల్లో పదేళ్ల కిందటే నాన్నగారి హాయంలో మినుము రూ.9 వేలు క్వింటాళ్లకు వచ్చిందని గుర్తుకు చేసుకుంటున్నారు. పత్తి రైతుకు రూ.4 వేలు కూడా రావడం లేదని ఆవేదనతో మాట్లాడుతున్నారు.
 •  పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే బీడు భూములు సాగులోకి వస్తాయి. నాన్నగారి పాలనలో వెలుగొండ ప్రాజెక్టు పనులు పరుగులు తీశాయి. మొదటి టన్నల్‌లో 15 కిలోమీటర్లు, రెండో టన్నళ్లో 10 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగిలిçపోయిన పనులను చంద్రబాబు చేస్తునే ఉన్నారు. అంచనాలు ఎలా పెంచుకోవాలి. బినామీ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు ఎలా గుంజాలని దిక్కుమాలిన ఆలోచన చేశారు.
 •  ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఇన్నేళ్ల పాలనలో మనకు కనిపించింది మోసం మోసం మోసం తప్ప మరేమి కనిపించలేదు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, అవినీతి, అధర్మం కనిపించాయి. 
 •  ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీరంతా ఆలోచన చేయండి. మళ్లీ చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే ..ఏం జరుగుతుందో తెలుసా?..ఈసారి గవర్నమెంట్‌ స్కూళ్లు ఏవి ఉండవు. ఐదేళ్ల పాలనలో అక్షరాల 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూత వేయించారు. టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయరు. సకాలంలో పుస్తకాలు ఇవ్వరు. మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే పేదవాడు తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఉండదు. 
 •  ప్రతి నియోజకవర్గంలోనూ నారాయణ స్కూళ్లు కనిపిస్తున్నాయి. మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తారు. నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీకి రూ.1 లక్ష గుంజుతున్నారు.
 •  చంద్రబాబు పాలనలో మన పిల్లలను ఇంజినీరింగ్‌ చదివించాలంటే ఏడాదికి ఫీజులు లక్షల్లో ఉన్నాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఈసారి ఏడాదికి రూ.5 లక్షలు చేస్తారు. ఆస్తులు అమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించలేకపోతున్నాం. మళ్లీ చంద్రబాబు వస్తే ఆస్తులు అమ్మినా..సరిపోవు.
 •  చంద్రబాబు పాలనలో ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్,డీజీల్‌ ధరలు విఫరీతంగా పెంచారు. ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు, కుళాయి పన్నులు బాదుడే బాదుడు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక వీరబాధుడే.
 •  ఇప్పటికే మీ భూములు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కున్నారు. ఇప్పటికే భూసేకరణ చట్టంలో సవరణలు చేశారు. వెబ్‌ ల్యాండ్‌ చట్టం తెచ్చారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక భూములు, ఇళ్లు ఉండవు. ఐదేళ్లలో ఇసుక, మట్టీ, కొండలు తవ్వేశారు. మళ్లీ ఆయనకు ఓటు వేస్తే మొత్తం దోచేస్తారు. ఇసుక రేటు లక్షకు చేరుతుంది.
 •  ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను ప్రోత్సహించారు. మీకు పింఛన్, రేషన్‌కార్డు కావాలంటే లంచం లేనిది ఏ పని జరుగడం లేదు. పింఛన్‌ కావాలంటే ..మీరు ఏ పార్టీ వారు అని అడుగుతున్నారు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీరు ఏ సినిమా చూడాలో. టీవీలో ఏ చానల్‌ చూడాలో కూడా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఏ స్కూల్లో చదవాలి. ఏ ఆసుపత్రికి వెళ్లాలో కూడా జన్మభూమి కమిటీలు నిర్ణయిస్తాయి. 
 •  ఇప్పటికే మహానాయకుడు సినిమా అందరూ చూడాలట. కానీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఎవరూ చూడకూడదట. మళ్లీ ఓటు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు, ఆరోగ్యశ్రీ, 108, 104 ఉండదు. పక్కా ఇళ్లు ఇవ్వడంలేదు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఇళ్లు ఇచ్చే పథకాన్ని రద్దు చేస్తారు.
 •  ఒక్కసారి చంద్రబాబు గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. 1994లో టీడీపీ ఇచ్చిన హామీలు రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచారు. రూ.5 కిలోబియ్యం పెంచారు. మద్యపానాన్ని ఏరులు పారించారు.
 •  రైతులు, డ్వాక్రా మహిళలకు ఇప్పటికే సున్నా వడ్డీలు పూర్తిగా ఎగిరిపోయాయి. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే వడ్డీలు బాదుడే బాదుడు. రైతుల రుణాలు పూర్తిగా కత్తరిస్తారు. స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ అంటూ ఎగురగొడుతారు. యువత, అవ్వతాతలకు ఏమీ అందవు. ఎన్నికలకు కోసం పింఛన్లు పెంచారు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మళ్లీ ఓటు వేస్తే ఇవేవి ఇవ్వరు. తనను వ్యతిరేకించేవారిని ఎవర్ని కూడా చంద్రబాబు బతకనివ్వరు. తన పోలీసులను రాజధాని నుంచి గ్రామ స్థాయి వరకు పెట్టుకుంటారు. పత్రికలు, టీవీలు అమ్ముడపోయాయి. మనుషులను చంపినా రాసేవారు ఉండరు. తానే చంపేసి బంధువులు చంపారని ప్రచారం చేస్తారు.
 •  బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలు, నిరుపేదలు, మద్యతరగతి వారికి ఉద్యోగాలు ఉండవు. వీరిని బతకనివ్వరు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే బీసీలు జడ్జిలుగా పనికి రారంటూ, వారు అనర్హులు అంటూ చంద్రబాబు లేఖలు రాశారు. 
 •  చంద్రబాబు చివరి మూడు నెలలుగా చూపిస్తున్న సినిమాలు, డ్రామాలు నమ్మితే..ఆయన చెప్పే ఎన్నికల వాగ్ధానాలు నమ్మితే ఎలా ఉంటుందో తెలుసా..నరమాంసం తినే అందమైన రాక్షసుడిని నమ్మితే ఏమవుతుందో అది జరుగుతుంది. చంద్రబాబు పాలన ఇలాగే ఉంటుంది. ఒకసారి మోసపోయాం. మళ్లీ అవే మోసాలు, అవే అబద్ధాలు, డ్రామాలు, మళ్లీ అవే టీవీ చానల్స్, పత్రికలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి..విశ్వసనీయతకు ఓటు వేయమని కోరుతున్నాను.
 • – ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఫలానిది చేస్తానని చెబితే ఆ హామీ నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది.
 • –3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఆ పాదయాత్రలో మీరుపడ్డ కష్టాలు నేను చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి ఇవాళ భరోసా ఇస్తున్నాను. నేనున్నానని భరోసా ఇస్తున్నాను. పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. అగ్రిగోల్డు బాధితులు చెప్పిన మాటలు విన్నాను. అగ్రిగోల్డు బాధితుడికి ఆరోజు పాదయాత్రలో చెప్పాను. మనందరి పార్టీ అధికారంలోకి రాగానే రూ.11 వేల కోట్లు కేటాయిస్తానని, అందరికీ న్యాయం చేస్తానని మాట ఇస్తున్నాను. ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు ఆ రోజు అడిగారు. పాదయాత్రలో మాటిచ్చా..ఆర్టీసీలో పని చేస్తున్న మొత్తం కార్మికులను ప్రభుత్వంలోవిలీనం చేస్తానని మాటిస్తున్నాను.
 •  అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తాను. ఐఆర్‌ 27 శాతం పెంచుతాను. న్యాయవాదులకు మాటిచ్చాను. మూడేళ్ల వరకు రూ.5 వేలు నెలనెల సై్టఫండ్‌ ఇస్తానని, రూ.100 కోట్లతో సంక్షేమ నిధి, సంఘమిత్రలు, వీఏవోల కష్టాలు విన్నాను. వారికి మాటిచ్చాను. మీ అందరి జీతాలు పెంచుతానని మాటిస్తున్నాను. ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల బాధలు విన్నాను. ఆ రోజే మాట చెప్పాను. సొంత ఆటో ఉన్న ప్రతి డ్రైవర్‌కు ఏటా రూ.10 వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాను. ఇన్సూరెన్స్, మరమ్మతులకు ఈ డబ్బు అవసరమవుతుంది.
 •  షాపులు ఉన్న ప్రతి నాయీ బ్రహ్మణుడు, రజక సోదరుడు, టైలర్స్‌కు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాను. పేదల కష్టాలను పాదయాత్రలో చూశాను. ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేస్తున్న వారి కష్టాలు చూశాను. చెప్పులు కుట్టుకుంటున్న ప్రతి పేదవాడికి మాటిచ్చాను. వీళ్లందరికి గుర్తింపు కార్డులు ఇస్తాం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను.
 •  ఆ రోజు పాదయాత్రలో జీతాలు పెంచమని హోం గార్డులు, అంగన్‌వాడీలు అడిగారు. వారికి కూడా హామీ ఇస్తున్నాను. పక్కరాష్ట్రం తెలంగాణ కంటే అధనంగా వెయ్యి ఎక్కువ ఇస్తానని చెబుతున్నాను.
 •  నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకుపోండి.  ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పెడుతున్నారు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి
 •  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.  గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి.  ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఆశ్వీరదించాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి దీవించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
 • శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని చ‌ట్ట‌స‌భ‌కు తీసుకెళ్తా
  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాన మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని నా ప‌క్క‌న కూర్చోబెట్టుకుంటాన‌ని, చ‌ట్ట‌స‌భ‌కు తీసుకెళ్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 

Back to Top