ఘనంగా ‘సుపరిపాలనకు మూడేళ్లు’

వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్‌ చేసి, నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసిన నేతలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, వంశీకృష్ణయాదవ్, కల్పలతారెడ్డి, మూరుగుడు హనుమంతరావు హాజరయ్యారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించిన అనంత‌రం.. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. 

Back to Top