పులివెందుల చేరుకున్న వైయస్‌ జగన్‌

పులివెందుల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. పులివెందుల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వైయస్‌ జగన్‌ మధ్యాహ్నం 1:49కి నామినేషన్‌ వేయనున్నారు. ఈ మేరకు పులివెందుల చేరుకున్న అనంతరం తాత వైయస్‌ రాజారెడ్డి, తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి, చిన్నాన్న వైయస్‌ వివేకానందరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

Back to Top