దేశంలో జీఎస్టీ ట్యాక్స్‌.. పలాసలో మాత్రం పీఎస్టీ ట్యాక్స్‌

ప‌లాస స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ స్థానిక స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న‌

శ్రీ‌కాకుళం: ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌లాస బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ స్థానిక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావిస్తూ భ‌రోసా క‌ల్పించారు. వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..పాదయాత్ర చేస్తు  నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీరు చెప్పిన కష్టాలు, బాధలను నేను విన్నాను. ఆ రోజు ఏం చెప్పారన్నది నేను విన్నాను.. మీ అందరికీ భరోసా ఇచ్చి చెబుతున్నాను.. నేను ఉన్నాను అని భరోసా ఇస్తున్నాను. ఆ రోజు మీరు చెప్పిన మాటలు ప్రతీది గుర్తుంది. అన్నా..రాష్ట్రంలో, దేశంలో జీఎస్టీ ట్యాక్స్‌ విన్నాం. కానీ ఈ పలాసలో మాత్రం పీఎస్టీ అని తెలుగుదేశం పార్టీ ట్యాక్స్‌ వేస్తున్న వైనాన్ని మీ నోటి నుంచి తెలుసుకున్నా.. ఏ రకంగా ప్రతి జీడిపప్పు ప్యాకెట్‌ మీద రూ. 10 ట్యాక్స్‌ కడుతున్నారో ఇక్కడి ఎమ్మెల్యే అల్లుడికి ట్యాక్స్‌ కడుతున్నారో ప్రతీది మీరు చెప్పింది విన్నా.. 
వ్యాపారులపై వేధింపులు, వినకపోతే అధికారులతో దాడులు. అన్ని చూశా.. విన్నా.. బావలపాడు పోర్టు వస్తుందనే ఆనందం కొద్దోగొప్పో ఉన్నా పోర్టు వల్ల మాకేం మేలు జరుగుతుందన్న అన్న మీ స్వరం నేను విన్నా.. పోర్టుతో పాటు అక్కడే మత్స్యకారులకు కూడా ఫిషింగ్‌ హార్బర్‌ కట్టాలని, పోర్టు వచ్చినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పోర్టు కోసం భూములు కోల్పోతున్న ఆ ప్రజలకు ఇచ్చే సొమ్ము అతి తక్కువగా ఇస్తున్నారని ప్రతీది విన్నా.. తిత్లీ తుఫాన్‌ వచ్చి నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదన్న మీ మాటలు విన్నా. రెండో విడుత జాబిత విడుదల కాలేదన్న బాధలు విన్నా.. ఇచ్చిన చెక్కులు చాలా వరకు చెల్లుబాటు కావడం లేదన్న మీ అంశాలు విన్న. కొబ్బరి చెట్లకు ఇస్తున్న కాంపన్సేషన్‌ రూ. 1500 తక్కువ అన్న మీ మాటలు విన్నా.. జీడి తోటలకు హెక్టార్‌కు ఇస్తున్న రూ. 30 వేలు చాలా తక్కువ అని విన్నా.. 
ఆ రోజు నేను అన్న మాటలన్నీ గుర్తున్నాయి. తిత్లీ తుఫాన్‌ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు చెప్పాను. కొబ్బరి చెట్టుకు రూ. 15 వందలు కాదు మనం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 3 వేలు చేస్తామన్న మాటలు గుర్తున్నాయి. జీడీ పంట హెక్టార్‌కు రూ. 30 కాదు.. రూ. 50 వేలు చేస్తామన్న మాటలు నాకు గుర్తున్నాయి. 
కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న బాధితుల కష్టాలు చూశా. వారికి కోసం గతంలో ధర్నాలు కూడా చేశాం. ఆ పరిస్థితులను నెమరవేసుకుంటూ ఒక వైపు ఆనందం, మరో వైపు బాధపడుతూ వారు చెప్పిన కష్టాలు విన్నాను. కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం ఏమాత్రం మంచిచేయని పరిస్థితులు వారు చెబుతున్న పరిస్థితులు విన్నా.. వేలమంది బాధితులు ఉంటే కేవలం 370 మందికే పెన్షన్లు ఇస్తున్నారన్న అని మీరు చెప్పిన బాధలు విన్నా.. కిడ్నీ రోగులకు నెలకు దాదాపు రూ. 8 వేలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం ముష్టివేసినట్లుగా రూ. 2500 ఇస్తే ఎలా బతకగలుగుతామని అన్నప్పుడు వారి బాధలు నేను విన్నాను. డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు వేల సంఖ్యలో ఉంటే కేవలం 14 వందల మందికి మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేస్తున్నారనే బాధలు విన్నా.. నెప్రాలజిస్టులు లేరు, వైద్యం సరిగ్గా జరగడం లేదన్నప్పుడు ఆ గుండె కోతలు నేను విన్నా.. వారి బాధలు ఇంకా నాకు గుర్తు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో 200 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ కం రీసెర్చ్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తాం, రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి నాణ్యమైన వైద్యం అందిస్తాం. మంచి మంచి డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం అందిస్తాం. గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే వైద్యం అందే విధంగా పరీక్షలు చేయడమే కాకుండా, ఉచితంగా మందులు అందజేస్తాం. 
అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మరొక్కసారి చెబుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు తోడుగా ఉంటామని, వారికి పెన్షన్‌ రూ. 10 వేలు చేస్తామని ఆరోజు చెప్పిన మాటలు గుర్తున్నాయి. అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం తాగే నీళ్లు క్వాలిటీ లేవని తెలిసినా పట్టించుకోని ప్రభుత్వాన్ని చూశాం. ప్రతి ఒక్కరికి చెబుతున్నా.. తాగడానికి నీటి క్వాలిటీని మారుస్తాం. రిజర్వాయర్‌ నుంచి కాల్వలు తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు ప్రతి ఒక్కరికీ అందజేస్తామని మాటిస్తున్నా.. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. 

Back to Top