తెలుగు ప్రజలకు వైయస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

పంటలు బాగా పండి రైతులు సంతోషంగానూ, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

      మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగ ఉన్న తెలుగువారందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు తమ సొంత గ్రామాలతోఉన్న  చెక్కుచెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు సంక్రాంతి ప్రతీక అని ఆయన అన్నారు.  సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెలు ప్రతి ఒక్కరికి గుర్కుతు వ వస్తాయన్నారు. పంటలు బాగా పండి రైతులు సంతోషంగానూ, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

          భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు సంక్రాంతి పేరు చెబితే అందరికీ గుర్తుకు వస్తాయని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన  తెలుగునేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారు సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకున్నారు.

Back to Top