దేవుడు అద్భుత‌మైన ఫ‌లితాన్ని ఇచ్చారు..

ఇక్బాల్‌ను త్వ‌ర‌లో ఎమ్మెల్సీని చేస్తా 

ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్‌విందులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

గుంటూరు: రంజాన్‌ శుభమాసంలో ఇఫ్తార్‌ విందులో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.సోమవారం సాయంత్రం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు  ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ   భగవంతుడు ఏం చేసినా కూడా అశ్చర్యంగా చేస్తారన్నారు. దేవుడు స్కిప్టు రాస్తే ఎంత గొప్పగా ఉంటుందనేది చెప్పడానికి రెండు ఉదాహరణలు  ఉన్నాయ‌న్నారు. గత ఐదేళ్లల్లో చంద్రబాబు 23 మందిని ఫిరాయించేలా చేశారు.వారిపై చర్య తీసుకోకుండా స్పీకర్‌ దాటవేత ధోరణితో వ్యవహరించార‌ని తెలిపారు.

 వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను టీడీపీ కొనుగోలు చేసిందని.. ఈ ఎన్నికల ద్వారా దేవుడు అద్భుతమైన ఫలితం ఇచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు 23 మందిని ఫిరాయించేలా చేశారు.మే 23న రంజాన్‌ మాసంలో ఫలితాలొచ్చాయి.టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు.ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుదన్నారు.వైయస్‌ఆర్‌సీపీ నుంచి నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.ఇక్బాల్‌ను త్వరలో ఎమ్మెల్సీని చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top