రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నా

తిరుపతి సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

తిరుమల కొండపైకి చెప్పులు వేసుకెళ్లానని దుష్ప్రచారం చేస్తున్నారు

చెప్పులు లేకుండా 3500 మెట్లు కాలినడకన వెళ్తే..బాబు పార్టనర్‌ బూట్లు వేసుకొని కొండపైకి వెళ్లారు

పక్క రాష్ట్రం వాళ్లు ప్రత్యేక హోదాకు మద్దతిస్తే బాబుకు నచ్చదు

కేసీఆర్‌ హోదాకు మద్దతిస్తే కనీసం కృతజ్ఞతలు తెలపకపోవడం దారుణం

బాబు తీసుకొచ్చిన వారిలో ప్రత్యేక హోదాకు ఒక్కరైనా మద్దతిచ్చారా?

 

 

తిరుపతి: తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నట్లు  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. హోదాపై అండగా ఉంటామని పక్క రాష్ట్రం వాళ్లు మద్దతిస్తే..స్వాగతించాల్సింది పోయి వారిపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పులు లేకుండా 3500 మెట్లు ఎక్కితే..చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ బూట్లు వేసుకొని కొండపైకి వెళ్లారని గుర్తు చేశారు. తనపై దుష్ప్రచారాం చేస్తున్నారని తెలిపారు. మార్పునకు ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో మంగళవారం నిర్వహించిన చివరి ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు.  రాష్ట్రానికి జీవన నాడి అని ప్రత్యేక హోదా సత్వరం వచ్చేలా ఆ తిరుమల వెంకన్న ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నా... 

ఒక్కసారి ఆలోచన చేయండి

ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి మరో రెండ్రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మీ అందరితో ఒక్క విన్నపం చేస్తున్నాను. మీరంతా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలని కోరుతున్నా.. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మంచి జరిగిందా.. అన్న అంశంపై ఒక్కసారి ఆలోచన చేయండి. మామూలుగా అభివృద్ధి జరిగిందని అంటుంటారు.. అభివృద్ధి అంటే నిన్నటి కన్నా.. ఈ రోజు బాగుంటే అభివృద్ధి చెందామని ఎవరమైనా అనుకుంటాం. కానీ అదే పరిస్థితి.. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఐదేళ్ల కంటే మన స్థితులు మెరుగ్గా ఉన్నాయా అని అడుగుతున్నా.. 

చదువులకు పేదరికం అడ్డుకాకూడదని..

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణపాలనలో చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఆ దివంగత నేత మీ కుటుంబ పెద్దగా నేనున్నాను.. నువ్వు చదువుకో నేను చదివిస్తాననే స్వరం వినిపించేది. ఆ కాలంలో మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి చదువులు చదవాలంటే పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ ఇచ్చి ఆ కుటుంబాలు అప్పుల పాటు కాకుండా నేనున్నానని భరోసా ఇచ్చాడు. ఆ రోజు కన్నా.. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి చదువులు చదివించాలంటే.. ఫీజులు చూస్తే సంవత్సరానికి రూ. లక్ష అవుతుంది. ఫీజురియంబర్స్‌మెంట్‌ పరిస్థితి చూస్తే పూర్తిగా కత్తిరించి నిర్వీర్యం చేశారు. ఫీజులు రియంబర్స్‌మెంట్‌ ఇచ్చేది అరకొరగా రూ. 35 వేలు ఇస్తున్నారు.. అది కూడా రూ. 18 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. మన పిల్లలు చదువుకోవాలంటే అప్పులపాలై, ఆస్తులు అమ్ముకుంటే తప్పా మన పిల్లలను చదివించే పరిస్థితుల్లో లేము.. 

ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో గమనించండి

నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉంటే అభివృద్ధి చెందామని అనుకుంటాం. నాన్నగారి హయాంలో ఏ పేదవాడికి ఆరోగ్యం బాగులేకపోయినా.. ఆ పేదవాడు 108కి ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చి పేదవాడిని తీసుకొని ఆస్పత్రిలో చేర్పించి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించే రోజులు వైయస్‌ఆర్‌ హయాంలో ఉండేవి. ఈ రోజు మనలో ఎవరికైనా బాగోలేకపోతే.. 108కి ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌  అంటూ రావాల్సిన అంబులెన్స్‌ వస్తుందో.. లేదో కూడా భయపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికైనా బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ పరిస్థితి దుర్మార్గంగా ఉంది. గుండెపోటు, న్యూరో సర్జరీ చేయించుకోవాలంటే మెరుగైన ఆస్పత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మనకు ఎవరికైనా బాగోలేకపోతే హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కటింగ్‌. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలల తరబడి బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఆ పెండింగ్‌ బకాయిల వల్ల ఆపరేషన్‌ చేయడానికి ఆస్పత్రులు ముందుకు రావడం లేదు.

ఒక్క పంటకైనా మద్దతు ధర  ఉందా?

పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వ్యక్తి కుర్చీలో పాదయాత్ర చేస్తున్న నా దగ్గరకు వచ్చి అన్నా.. పక్షవాతం వచ్చిందన్నా.. మందుల కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నా.. ఆదుకునేవాడు ఎవరూ లేరన్నా అన్న స్వరం ఇవాల్టికి రింగ్‌.. రింగ్‌మని వినిపిస్తుంది. అభివృద్ధి అంటే ఇదేనా అని ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు ఇవాళ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి అక్షరాల రూ. 87,612 కోట్ల రుణాలు ఉంటే.. అవి ఐదు సంవత్సరాల తరువాత వడ్డీలతో కలిపి రూ. 1.50 లక్షల కోట్లకు ఎగబాకి రైతుల నెత్తినపడ్డాయి. గతంలో రైతులకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితులు చూశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు అందలేదు. రైతులకు అభివృద్ధి జరిగిందా అంటే.. గతంతో పోల్చితే.. ఇవాళ పంటల రేట్లు బాగున్నాయా అని ఆలోచన చేయండి. నాన్నగారి హయాంలో రూ. 16 వేలు పలికిన పసుపు ఇవాళ రూ. 5 వేలకు కూడా కొనని పరిస్థితి కనిపిస్తుంది. 

ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా?

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు నాన్నగారి హయాంలో చిరునవ్వుతో కనిపించేవారు. బ్యాంకుల వెళ్లి వడ్డీలేని రూ. లక్షల రుణాలు తీసుకొని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి. ఇవాళ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 14,200 కోట్ల రుణాలు ఉంటే.. ఐదు సంవత్సరాల్లో అవి తడిసిమోపెడై అక్షరాల రూ 28 వేల కోట్లకు ఎగబాకిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఒక్క రూపాయి మాఫీ చేయకపోగా.. గతంలో ఉన్న సున్నావడ్డీ పథకం కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి.. 

మన పిల్లలు డిగ్రీ చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వలస

చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా..? జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ. 2 వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయిన తరువాత నిరుద్యోగులను పట్టించుకోని పరిస్థితి. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో అక్షరాల 1.42 లక్షల ఉద్యోగాఉలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ సిఫారస్సు చేస్తే ఆ ఉద్యోగాలు విడుదల చేస్తారని పిల్లలు పరీక్షల కోసం వేలకు వేల రూపాయలు కోచింగ్‌ సెంటర్లకు పెడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో రిటైర్డ్‌ అయిపోయిన వారిని కూడా కలుపుకుంటే మరో 90 వేల ఉద్యోగాలు. అంటే అక్షరాల రాష్ట్రంలో 2.30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా అని అడుగుతున్నా.. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా.. మన పిల్లలు డిగ్రీ చేతపట్టుకొని ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలసలు పోతున్నారు. 

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు

ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసి కాపురం చేస్తాడు. కేంద్రంలో తన పార్టీకి సంబంధించిన ఎంపీలను కేంద్రంలో మంత్రులుగా కొనసాగించారు. నాలుగు సంవత్సరాలు బీజేపీ వాళ్లు చంద్రబాబును పొగిడితే.. చంద్రబాబు బీజేపీని పొగడడం.. వెంకయ్యనాయుడు ఎప్పుడు వచ్చినా.. ఆహా.. ఓహో చంద్రబాబు అనడం.. ఆహా.. ఓహో వెంకయ్యా అని చంద్రబాబు అంటాడు. నాలుగు సంవత్సరాలు చిలుక గోరింకలకు కూడా బీజేపీ, టీడీపీ కాపురం చేశాయి. నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ కూడా చేయలేదు. ఒక్కసారి చూడండి.. నాలుగు సంవత్సరాల ఈ పాలనలో చేతిలో ఉన్న ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టాడు. 

ఐదేళ్ల పాలనలో మోసం..అబద్ధాలు, అన్యాయమే

రాజకీయాల్లో మనకు కనిపిస్తుంది కుట్రలు, కుతంత్రాలు కనిపిస్తున్నాయి. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మోసం, అవినీతి, అబద్ధం, అన్యాయం, అధర్మాన్ని చూస్తున్నాం. ప్రతి విషయంలో, ప్రతి అడుగులోనూ వీళ్లు చేసేటివి కుట్రలు, మోసాలు, అవినీతి చేస్తున్నారు. కేసీఆర్‌ గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నా.. మీరంతా 20 రోజులుగా టీవీలు చూస్తుంటే.. కేసీఆర్‌ అంటే ఒక బూత్‌ అన్నట్లుగా.. కేసీఆర్‌తో జగన్‌ కలిసిపోయాడంట.. రకరకాలుగా ఎల్లో మీడియా విషం చిమ్ముతుందో ఆలోచన చేయండి. ఇదే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నిన్న కేసీఆర్‌ మాట్లాడుతూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై తన పార్టీకి సంబంధించిన ఎంపీలతో మద్దతు ఇస్తానని నిన్న ప్రకటించారు. ప్రత్యేక హోదా రావాలంటే ఎలా వస్తుందో ఆలోచన చేయండి.. మనకు 25 ఎంపీల బలంతో పాటు పక్కన తెలంగాణలోని 17 మంది ఎంపీలు మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి కావాలని డిమాండ్‌ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. కేసీఆర్‌ కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. ఆంధ్రరాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో నా మద్దతు ఉంటుందని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిస్తే.. అభివృద్ధి కోరుకునే వ్యక్తి స్వాగతిస్తారు.. కృతజ్ఞతలు తెలుపుతారు. కేసీఆర్‌ అనే వ్యక్తి చంద్రబాబుకు సరిపోడు.. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చినా కూడా ఆయన మద్దతు ఇచ్చినా కూడా దొంగ దొంగ అని ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబుకు ఇష్టం లేదు కాబట్టి.. ఇటువంటి రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం.. 

స్వాగతించాల్సింది పోయి కుట్రలు

ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో ప్రచారం కోసం చంద్రబాబు చాలా మంది నాయకులను అద్దెకు తీసుకువస్తున్నాడు. చంద్రబాబు మైకు పట్టుకుంటే పక్కన వేరే రాష్ట్ర నాయకులు ఉంటున్నారు. ఆ అద్దెకు తీసుకువచ్చిన నాయకులతో ఒక్కరితోనైనా కనీసం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదానిలో మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పించావా.. కనీసం ఒక్కరితో కూడా మద్దతు ఉంటుందని అనిపించలేకపోయాడు. కానీ అదే పక్కన కేసీఆర్‌ నాలుగు అడుగులు ముందుకు వేసి వచ్చి తెలుగువారు ఒకరికొకరు కలిసి ఉండాలని ప్రత్యేక హోదా కోసం అండగా ఉంటామని ప్రకటిస్తే.. కనీసం స్వాగతించాల్సింది పోయి కుట్రలు చేస్తున్నారు. ఇవాల్టి వరకు చంద్రబాబు చెప్పలేదు.. ఆయన పాట్నర్‌ కూడా చెప్పలేదు. 

 వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు.. 

రాబోయే రోజుల్లో ఈ కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా చూస్తాం. ఈ రెండ్రోజుల్లో మీ అందరికీ చాలా కుట్రలు కనిపిస్తాయి. ఈనాడులో రాతలు, ఆంధ్రజ్యోతిలో రాతలు, టీవీ9లో, టీవీ5లో ఈ రెండ్రోజులు ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. దొంగ వీడియోలు, దొంగ ఫొటోలు రిలీజ్‌ చేస్తారు. ఆంధ్రజ్యోతిలో మన విజయసాయిరెడ్డి మాట్లాడకపోయినా.. మాట్లాడినట్లుగా ఆయన మీద ఆడియో చూపించారు. పది రోజుల్లో ఇదే ఆంధ్రజ్యోతిలో దొంగ సర్వేలు చూపిస్తున్నారు. ఆ సర్వే వారు మాకు సంబంధం లేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చినా దొంగ సర్వేల ముద్రణ. గర్భిణీ మీద దాడి అని వైయస్‌ఆర్‌ సీపీకి ముడిపెడుతున్నారు. చివరకు తన పాట్నర్‌ ఈ రోజు మధ్యాహ్నం అన్నాడు.. నేను తిరుపతికి చెప్పులు వేసుకొని పోయానంట.. అబద్ధాలు ఆడేటప్పుడు ఆలోచన చేయండి.. తిరుమలకు జగన్‌ అనే వ్యక్తి చెప్పులు విప్పి కాలినడకన 3500 మెట్లు ఎక్కి నడిచాను.. ఇదే పాట్నర్‌ బూట్లతో నడిచాడు.. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు.. 

జగన్‌ ఒక్కడి వల్లే సాధ్యం కాదు

ఒక్క సారి ఆలోచన చేయండి.. ఈ రాజకీయాలు మారాలి.. అబద్దాలు పోవాలి. విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. ఎన్నికల ప్రణాళికలో పెట్టి చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి. ఈ వ్యవస్థ మొత్తం మార్పు జరగాలి. నిజాయితీ, మార్పు రావాలి. ఇది జగన్‌ ఒక్కడి వల్లే సాధ్యం కాదు.. మరో రెండ్రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రెండ్రోజుల్లో మార్పు తీసుకురాగలిగే వ్యక్తులు మీరే.. మీ చేతుల్లో ఉన్న బటనే మార్పుకు నాంది. 

మార్పుకు ఓటు వేయాలి

తొమ్మిదేళ్లుగా మీరు నన్ను చూస్తున్నారు.. ఎక్కడ ఏ పేదవాడికి ఏ అవసరం వచ్చినా జగన్‌ అనే వ్యక్తి కనిపిస్తాడు.. ధర్నా చేశాడు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా.. జగన్‌ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేశాడు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి పోరాడింది జగన్‌ తప్ప ఇంకెవరూ లేరు. తొమ్మిదేళ్లుగా నన్ను చూశారు కాబట్టి ఒక్క సారి ఆలోచన చేయండి మీకు ఎలాంటి నాయకుడు కావాలో.. నాయకుడంటే.. ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగురవేసుకొని పలానా వ్యక్తి మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ఉండాలి. నాయకుడంటే విశ్వసనీయత, నిజాయితీ, ప్రజలు తప్ప మరొకటి కనిపించకూడదు.. వాడే నాయకుడు. అప్పుడే నాయకుడు అవుతాడు. ఆ గుణాలు మన ఖర్మ కొద్ది ఇప్పుడు పాలన చేస్తున్న వారిలో లేవు. మార్పుకు ఓటు వేయాలని మీ అందరినీ కోరుతున్నా.. 

మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కరుణాకర్‌ అన్న నిలబడ్డాడు.. మంచివాడు, సౌమ్యుడు, మంచిచేస్తాడని నమ్ముతున్నాను.. మీ అందరి చల్లని దీవెనలు కరుణాకర్‌ అన్నపై ఉంచాలి. అదే విధంగా మన పార్టీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్‌ అన్న నిలబడ్డాడు.. మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది.. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు, వీరిద్దరిపై, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంచాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

Back to Top