పేదవాడి గుండెచప్పుడే వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో

టెక్కలి సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పాదయాత్ర చేశాను

ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారో ఆలోచించండి

భావనపాడు పోర్టు నిర్వాసితులను చంద్రబాబు ఇబ్బంది పెట్టారు

తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం

మత్య్సకారులకు అన్ని విధాల తోడుగా ఉంటాం

నష్టపోయిన కొబ్బరి చెట్టుకు రూ.3 వేల పరిహారం ఇస్తాం

హామీలన్నీ నెరవేర్చాకే మళ్లీ ఓటు అడుగుతా

 

శ్రీకాకుళం: ప్రతి పేదవాడి గుండెచప్పుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో పెట్టామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి రోజు మీకు మేనిఫెస్టో చూపిస్తామని, ఐదేళ్ల తరువాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తానని, అన్ని హామీలు నెరవేర్చాకే మళ్లీ ఓటు వేయమని అడుగుతానని చెప్పారు. రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయత ఉండాలన్నారు. మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

  • ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగానంటే ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెలనతో చేయగలిగానని గర్వంగా చెబుతున్నా.. ఇదే టెక్కలి గుండా నా ప్రయాణం జరుగుతున్నప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట ఇవాల్టికి గుర్తున్నాయి. మీరు పడిన కష్టాలు, బాధల గురించి చెప్పారు. మీ అందరికీ నేనున్నానని భరోసా ఇచ్చి చెబుతున్నా. మహేంద్రతనయా ఆఫ్‌షో రిజర్వాయర్‌ గురించి చెప్పారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ. 140 కోట్లతో శ్రీకారం చుట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ చేయని విధంగా ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. అక్షరాల అందులో రూ. 62 కోట్లు ఖర్చు చేసి 40 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టు ఆయన మరణం తరువాత ఎవరూ పట్టించుకోని పరిస్థితి కనిపించింది. చివరగా మిగిలిన రూ. 78 కోట్ల రూపాయల వర్కులను టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంచనాలను రూ. 442 కోట్లకు పెంచి ఏరకంగా దోచేస్తున్నారని ప్రజలు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రాజెక్టు పూర్తవుతుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలిందని చెప్పిన మాట ఇవాల్టికి గుర్తుంది. 
  • మహేంద్ర తనయా ఆఫ్‌ షో రిజర్వాయర్, వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు గానీ ఏరకంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం అమలు చేయాలని అడుగుతున్నారో.. పెడచెవిన పెట్టిన కుటుంబ సభ్యుల గాథలు నేను విన్నా.. మీ ప్రతి బాధను నేను విన్నా.. మీ ప్రతి కష్టాన్ని నేను చూశా.. మీ అందరికీ కచ్చితంగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా..
  • కాకర్లిపల్లి పవర్‌ ప్లాంటు 51 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు అధికారంలోకి రాగానే ప్రాజెక్టు రద్దు చేస్తామని హామీ ఇచ్చాడు. జీఓ 1108 ఇప్పటికీ రద్దు చేయలేదు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఎలా మోసం చేశాడో ఇక్కడి ప్రజలు చెప్పిన బాధలు నేను విన్నాను. 51 గ్రామాలకు చెందిన ప్రజలకు హామీ ఇస్తున్నాను.. మీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నా..
  • బావలపాడు పోర్టు పేరిట ఏరకంగా భూపందారం మొదలు పెట్టారు. ఏకంగా 4900 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని, పరిహారం కోసం ఆ రైతులు అవస్థలు పడుతున్న రైతులు ఇబ్బందులు చెప్పారు. మార్కెట్‌ ధర ఎకరాకు రూ. 25 లక్షలు ఉంటే.. ప్రభుత్వం కేవలం రూ. 12 లక్షలు ఇస్తున్న పరిస్థితుల్లో మా భూములు అంత తక్కువ రేటుకు ఇస్తే ఎలా బతకాలన్నా అని రైతులు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. కచ్చితంగా ఆ బావలపాడు నిర్వాసితులకు నేను చెబుతున్నా.. మీ కష్టాన్ని నేను విన్నాను.. మీ అందరికీ తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా.. 18 తీర ప్రాంత గ్రామాల్లో సుమారు 20 వేల మంది మత్స్యకారులకు కోల్డ్‌ స్టోరేజీ సదుపాయం కల్పిస్తామని ఏరకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాటి ఇచ్చారో.. సదుపాయం కల్పించని కారణంగా వేటుకు వెళ్లి తీసుకువచ్చినవి తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని చెప్పినా.. కోల్డ్‌ స్టోరేజీ వంటి చిన్న పని కూడా చేయని అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంది. ప్రతి మత్స్యకార సోదరుడికి చెబుతున్నా.. మీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. బావలపాడు పోర్టులో ఫిషింగ్‌ హార్బర్, కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.. 
  • తిత్లీ తుఫాన్‌తో ఇచ్ఛాపురం, పలాసా, టెక్కలి, పాతపట్నంలో కొంత ప్రాంతం అతలాకుతలమైన పరిస్థితులు చూశాం. ఏకంగా రూ. 3,430 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు స్వయంగా కేంద్రానికి లేఖ రాశాడు. ఆ తరువాత తిత్లీ తుఫాన్‌కు ఆయన ఇచ్చింది ముష్టివేసినట్లుగా కేవలం రూ. 510 కోట్లు. అంటే కనీసం 15 పైసలు కూడా ఇవ్వని పెద్ద మనిషి తిత్లీ తుఫాన్‌ బాధితులను ఆదుకున్నానని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి.  కొబ్బరి చెట్టుకు రూ. 15 వందలు పరిహారం ఇచ్చి అదే చాలా గొప్ప అని చెప్పుకుంటున్న నాయకులకు బుద్ధి వచ్చేలా.. దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొబ్బరిచెట్టుకు రూ. 3 వేలు ఇస్తానని హామీ ఇచ్చాను. జీడికి హెక్టార్‌కు రూ. 30 వేలు ఇచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 50 వేలు ఇస్తాం. మీ అందరికీ తోడుగా ఉంటానని మాటిస్తున్నా.. 
  • ఐదేళ్లలో టెక్కలి నియోజకవర్గంలో జరిగిందేమిటని ప్రజలు నాకు చెప్పిన ప్రతి విషయం గుర్తుంది. ఆముదాలవలస, నర్సన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందాకు రింగ్‌ మాస్టర్‌ అచ్చెన్నాయుడు. వీళ్లు ప్రజలకు చేసిందేమీ లేదు. కానీ, ఎలా దోచుకోవాలని స్కెచ్‌లు గీసి ఇసుకను, మట్టిని, గ్రనైట్‌ క్వారీలను ఏదీ వదలకుండా దోచుకుంటున్నారు. ఇదే నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్‌ అయినా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకే. నీరు చెట్టులో ఇష్టానుసారంగా తవ్వి ఆ మట్టిని కూడా అమ్ముకొని వందల కోట్లు సంపాదించారు. చివరకు ఇదే టెక్కలిలో రూ. 5 కోట్లు విలువ చేసే ఎకరా ఆర్టీసీ  స్థలాన్ని కేవలం రూ. 3 లక్షలకు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా..
  • ఇదే నియోజకవర్గంలో రింగ్‌ మాస్టర్‌ అచ్చెన్నాయుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా, చివరకు ఏ స్థాయిలో లంచాలు ఇవ్వాల్సి వస్తుందంటే.. కార్పొరేషన్‌ ద్వారా వచ్చే అరకొర రుణాలకు కూడా లంచాలు, మరుగుదొడ్లకు లంచాలు, చివరకు అంగన్‌వాడీ సహా చిన్న చిన్న పోస్టులు తీసుకోవాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనని ప్రజలు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీకి అనుకూలంగా ఉన్నారని కోటబొమ్మాళి మండలంలో యలమంచలి సహా 15 వందల మందికి పెన్షన్లు కట్‌ చేశారని వారు కోర్టుకు వెళితే.. కోర్టు అక్షింతలు వేసినా కూడా చివరకు పట్టించుకోని విధంగా అధికారులు తయారైన పరిస్థితి. మంత్రులు జులుం చేస్తున్న పరిస్థితి గురించి ఆ రోజు చెప్పిన మాట గుర్తుంది. 26 మంది వైయస్‌ఆర్‌ సీపీ సర్పంచ్‌ల చెక్‌పవర్‌ ఏరకంగా మంత్రి అచ్చెన్నాయుడు తీసేశారో.. 13 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఏరకంగా తీసేశారో.. ఇక్కడి ప్రజలు చెప్పారు. జరుగుతున్న దౌర్జన్యం మీరు చూస్తున్నారు. అరాచకం మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో 59 నెలల చంద్రబాబు పాలన చూశారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మనం చూసిందేమిటని ఒక్కసారి ఆలోచన చేయండి. మోసం.. మోసం.. మోసం అనే పదాలు చూస్తున్నాం. 
  • ఐదు సంవత్సరాలను ప్రజలు మోసం చేసి, ప్రజలకు అబద్ధాలు చెప్పి అన్యాయాలు చేసిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలు వచ్చాయని మళ్లీ మోసం చేసేందుకు తయారయ్యాడు. ఎన్నికలు వచ్చాయని టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నాడు. 2014లో కూడా టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. లేకుంటే ఇంటింటికి రూ. 2 వేల భృతి అన్నాడు.. ఐదేళ్లలో ఇంటింటికీ రూ. 1.20 లక్షలు బాకీపడ్డాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. బంగారం ఇంటికి వచ్చిందా..? 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రకటనలు గుర్తున్నాయా.. డ్వాక్రా రుణాలు మాఫీ, రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలన్నాడు.. రుణాలు మాఫీ అయ్యాయా..? ఇదే చంద్రబాబు ఈ రోజు మళ్లీ మోసం చేసేందుకు అవే టీవీలు, అవే ప్రకటనలు, మళ్లీ మోసం చేసేందుకు మేనిఫెస్టో. 
  • చంద్రబాబు 2014లో 50 పేజీల ఎన్నికల మేనిఫెస్టో 650 హామీలు ఇచ్చాడు. వ్యవసాయ రుణాలు మాఫీ, రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పొదుపు సంఘాల రుణాల మాఫీ, బెల్టుషాపులు రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ఆపదలో ఉన్న మహిళల సెల్‌ఫోన్‌ ద్వారా ఫోన్‌ చేస్తే 5 నిమిషాల్లో సాయం, యువతకు ఉద్యోగం, ఉపాధి, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, పేదలకు కేజీ నుంచి పీజీ వరకు విద్య, ఎన్టీఆర్‌ సృజల స్రవంతి పథకం ఇంటింటికీ రూ. 2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్, అవినీతి లేని సుపరిపాలన.. ఈ హామీల కింద చంద్రబాబు సంతకం, 50 పేజీలతో మేనిఫెస్టో ఒక్కో కులానికి ఒక పేజీ, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలని చెప్పి పీహెచ్‌డీ చేసి అన్ని వర్గాలను మోసం చేశాడు. 2014 మేనిఫెస్టో ఎక్కడుందని టీడీపీ వెబ్‌సైట్‌లో కనిపించకుండా మాయం చేశాడు. ప్రజలు ఎక్కడ కాలర్‌ పట్టుకుంటారోనని మాయం చేశాడు. మళ్లీ ఐదేళ్ల తరువాత అదే డ్రామా.. 2014 మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ప్రణాళిక బద్ధంగా ఐదేళ్లుగా అమలు చేశామని సిగ్గులేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. 2014లో 50 పేజీలు, 2019లో 34 పేజీల మేనిఫెస్టో పెట్టాడు. ప్రతి కులానికి పేజీ పెట్టి ఎలా మోసం చేయాలని చూస్తున్నారు. 
  • మన మేనిఫెస్టో కేవలం ఒకే ఒక్క పేజీ. పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి మాట, నవరత్నాల్లో నేను చెప్పిన ప్రతి బాట.. ప్రతి పేదవాడి గుండె చప్పుడు దాంట్లో పెట్టా.. ఈ మేనిఫెస్టో మనం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రోజూ చూపిస్తాం. ప్రతి రోజు ఇది చెప్పాం.. ఇది చేశామని చూపిస్తాం. ఐదు సంవత్సరాల తరువాత ఇదే మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తా.. చెప్పిన ప్రతి హామీ చేశాను.. నాకు ఓటేయండి అని 2024 ఎన్నికలకు వస్తా. 
  • రాజకీయ వ్యవస్థ మారాలి. ఒక రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా చేస్తానని చెప్పి.. అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటు అడిగి అధికారం చేపట్టిన తరువాత హామీ అమలు చేయలేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఇవాళ రాజకీయాలు చూస్తున్నారు. ప్రతి రోజు ఒక కుట్ర జరుగుతుంది. ఈ రోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5తో యుద్ధం చేస్తున్నాం. అమ్ముడుపోయిన ప్రతి చానల్‌తో యుద్ధం చేస్తున్నాం. గత నెల నుంచి గమనిస్తే కనిపించేది ఒక్కటే.. ప్రతి రోజు వీళ్లు ఒక పుకారు పుట్టిస్తున్నారు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కారణం.. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే.. ప్రజలు టీడీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారని చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు తెలుసు. కుట్ర చివరి రోజు వచ్చే సరికి చంద్రబాబు ప్రతి ఊరికి మూటల మూటల డబ్బు పంపిస్తాడు.. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెడతాడు.. మీరంతా గ్రామాలకు, వార్డులకు వెళ్లి.. ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అవ్వను, ప్రతి తాతను, ప్రతి అన్నను కలవండి. 
  • అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 
  • పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 
  • పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. నాలుగు రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 
  • గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. నాలుగు రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 
  • అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. నాలుగు రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 
  • ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. నాలుగు రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లు కట్టడం చూశాం. మళ్లీ అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.
  • నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి ఇంటికి తీసుకెళ్లండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని, ప్రతి పేదవాడి మొహంలో ఆనందం కనిపిస్తుంది. ప్రతి రైతు మొహంలో చిరునవ్వు కనిపిస్తుందని నమ్ముతున్నాను. నవరత్నాలను మీ గడపకు తీసుకువస్తానని మాటిస్తున్నాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని కోరుతూ..  మన పార్టీ తరుఫున తిలక్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు తిలక్‌పై ఉంచాలని కోరుతున్నా..  మన పార్టీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా శ్రీను నిలబడుతున్నాడు. మంచి చేస్తాడనే విశ్వాసం నాకు ఉంది  మీ అందరి చల్లని దీవెనలు వీరిద్దరిపై ఉంచాలని కోరుతున్నా.. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 
  •  
Back to Top