రేపు ఢిల్లీకి వైయ‌స్ జ‌గ‌న్‌

ప్రధాని మోదీతో భేటీ
 

అమరావతి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్‌ జగన్‌ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైయ‌స్‌ జగన్‌ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైయ‌స్ జగన్‌ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని వైయ‌స్‌ జగన్‌ కోరనున్నారు.  వైయ‌స్ జగన్‌ ఈనెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

Back to Top