పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌ 

వైయ‌స్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల అరెస్టు? 

అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు టార్గెట్ చేశారు.  బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామ సర్పంచ్‌ ఆదినారాయణ రెడ్డి సహా ఐదుగురు వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైయ‌స్ జగన్‌ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా ఎందుకు నిర్వహించారంటూ పోలీసులు ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ జగన్‌ బర్త్‌డే వేడుకలకు సంబంధించి సరైన కారణాలు చెప్పకుండానే నేతలను అదుపులోకి తీసుకోవడం అక్రమ అరెస్టులేనని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన సాక్షి విలేఖరి శాంత కుమార్‌ని  ఎస్సై నరేంద్ర దుర్భాషలాడు. 

Back to Top