నేడు రాజ్‌భ‌వ‌న్‌కు వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్ల‌నున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, విధ్వంసాలను రాష్ట్ర గవర్నర్‌కు వైయస్‌ జగన్ వివరించనున్నారు.

వినుకొండలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై అతిదారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు వైయస్ జగన్ అందజేస్తారు.

Back to Top