తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించిన పార్టీ అధినేత.. బొత్స గెలుపుపై ఎంపీటీసిలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో వ్యవహరించాల్సిన తీరుపై వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.