ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

అమెరికా:  ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైయస్‌ జగన్‌ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి చేయూత నివ్వాలని కోరారు. 

 అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డాలస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు వేలాది మంది ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఉత్తేజ భరితంగా ప్రసంగించిన విషయం విధితమే. ప్రవాసాంధ్రులు మన (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్రానికి వచ్చి ఆయా రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని, అందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. 
 

Back to Top