అమరావతి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 11 మాస శివరాత్రుల్లో ఔన్నత్యమైన మహా శివరాత్రిని ప్రజలు అత్యం త భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావనతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకుంటారని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు జగన్ తెలిపారు.