జ్యోతి సురేఖను అభినందించిన సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి : భారత ఆర్చర్‌, అర్జున పురస్కార గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. మంగళవారం జ్యోతి సురేఖ సచివాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జ్యోతి సరేఖను సీఎం వైయస్‌ జగన్‌ శాలువతో సత్కరించారు. జ్యోతి సురేఖ తాను సాధించిన పతకాలను సీఎం వైయస్‌ జగన్‌కు చూపించారు. జ్యోతి సురేఖ వెంట మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు. 

కాగా, జ్యోతి సురేఖ ఆర్చరీలో కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో, ఈ ఏడాది జూన్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. 

తాజా ఫోటోలు

Back to Top