తాడేపల్లి: కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.