తొలి ప్రభంజనం.. అద్భుత ఘట్టం

తండ్రి వైయస్ ‌రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో, ప్రజా రాజకీయ కుటుంబ నేపథ్యంతో  2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ప్రజల మనసు గెలుచుకున్నారు. కడప ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. యువ పార్లమెంటేరియన్‌గా ఎదుగుతూ...పెద్దల ఆశీస్సులతో ముందుకు సాగుతున్న తరుణంలో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జీవితంలో ఓ హఠాత్‌పరిణామం..

2009 సెప్టెంబరు 2న ముఖ్యమంత్రి  వైఎస్‌రాజశేఖరర రెడ్డి  అకాల మరణం....ఇటు వైయస్సార్‌ కుటుంబానికి అటు ప్రజలకు ఒక పెద్ద షాక్‌. ఉరుము లేని పిడుగు మీద పడ్డట్టు ప్రజలు శోకసాగరంలో మునిగిపోయారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సరికొత్త చరిత్ర రాస్తున్న జన హృదయనేత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది...ఈ సమయంలో నాడు దాదాపుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా యువనేత వైయస్ జగన్‌సీఎం కావాలని కోరుతూ సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ‌ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని మరి కొందరు వైయస్‌ జగన్‌కు సూచించారు. 

తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని చెప్పిన జగన్‌...ప్రజాస్వామ్య రాజకీయ విలువలకు కట్టుబడ్డారు. మనదారి రహదారి...అడ్డదారి కాదని స్ట్రెయిట్‌పాలిటిక్స్‌కు జై కొట్టారు. ఈ దశలో ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి తీరాలని జగన్‌తీసుకున్న ఒక నిర్ణయం ఆయన గమనాన్ని, గమ్యాన్ని మార్చేసింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన  అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు , ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఓదార్పు యాత్ర చేయాలని జగన్‌నిర్ణయించుకున్నారు. ఇలాంటి నిర్ణయం దేశ రాజకీయాల్లోనే అంతవరకూ ఎవరూ తీసుకోలేదు. 

వైయస్‌ జగన్‌తలపెట్టిన ఓదార్పుయాత్రకు మొదట అంగీకరించిన   కాంగ్రెస్‌అధిష్టానం ఆ తర్వాత  ససేమిరా అంది. ఓదార్పు యాత్రకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ వైయస్‌జగన్‌తన తల్లి, సోదరితో కలసి ఢిల్లీదాకా వెళ్లి  కోరినా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమ్మతించలేదు. ఓదార్పుయాత్ర పక్కన పెట్టేసి  తమ మాట ప్రకారం నడుచుకుంటే  కేంద్ర మంత్రిని చేస్తాం, కొన్నాళ్లకు  ముఖ్యమంత్రిని కూడా చేస్తామని నాటి కేంద్రమంత్రులతో చెప్పించారు. అక్కడితో ఆగకుండా తమ మాట వినకుంటే కష్టాలు తప్పవని హెచ్చరించారు కూడా.  అయితే ఇటువైపు వున్నది వైయస్సార్ కుమారుడు... వైయస్‌ జగన్ ...జన రాజకీయాల్లో మాటకు ప్రాణమిచ్చే తత్వం అణవణువున్నా జీర్ణించుకున్న యువనేత. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేందుకు  అవసరమైతే కష్టాలకైనా ఎదురీదాలే తప్ప పదవులకోసమో..సుఖాల కోసమో  ప్రజలను మర్చిపోతే ఆ జీవితానికి అర్ధమే లేదని జగన్ నమ్మారు. అందుకే కాంగ్రెస్ హై కమాండ్ అనుచిత, కుట్రపూరిత, రాజకీయ దురుద్దేశ ఆదేశాలను బేఖాతరు చేశారు.

ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్ ‌మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఆరేడువందలమంది అభిమానుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానంటూ నల్లకాలువ సభ సాక్షిగా  ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగారు. వైఎస్సార్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని మొదలైన  కుట్రలు, కుతంత్రాలను నిరసిస్తూ... కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీకి  వైఎస్‌ జగన్‌, ఆయన తల్లి విజయమ్మ 2010 నవంబర్‌ నెలలో రాజీనామా చేసి బైటకు వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చేసిన మానసిక గాయాలను తట్టుకోలేక ఒంటరిగానే బైటకు వచ్చారు. ఆ పార్టీ ద్వారా గెలిచిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు వైఎస్‌జగన్, విజయమ్మ రాజీనామాలు చేశారు. 

వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న వైఎస్సార్‌ కాంగ్రెస్ ‌పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. వైయస్ జగన్‌ను, ఆయన తల్లి విజయమ్మలను ఓడించాలనే కసితో అధికార కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు చేయని కుట్ర లేదు. పదుల సంఖ్యలో నాటి కాంగ్రెస్‌మంత్రులు, ముఖ్యనేతలు కడప జిల్లాలోనూ చుట్టు పక్కలా చక్కర్లుకొట్టారు. అయినా ప్రయోజనం లేకపోయింది... ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకన్న వైయస్ జగన్‌, వైయస్ విజయమ్మలను ఓడించలేకపోయారు..

2011 మే 13న ప్రకటించిన ఉప ఎన్నికల ఫలితాల్లో వైయస్ జగన్‌ 5 లక్షలా, 43 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం సాధించారు. ఇది నాటికి దేశంలోనే అతి పెద్ద మూడో మెజారిటీ. ఆ విధంగా 2011 మే 13 అనేది వైయస్ జగన్ జీవితంలో ఒక ముఖ్యమైన తేదీగా నిలిచింది. వైయస్సార్‌ కాంగ్రెస్ ‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పులివెందుల అసెంబ్లీ సీటునుంచి 85 వేలకు పైగా ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు. ఆ విధంగా ప్రజలు అందించిన ఘనమైన మెజారిటీతో రెండోసారి పార్లమెంటులో వైయస్‌ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 

అత్యంత బలమైన అధికార కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ అధినేత్రి సోనియాను ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఢీ కొన్న వైయస్‌ జగన్‌ అత్యధిక మెజారిటీతో కడప పార్లమెంటు స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. ప్రజాబలమే అండగా ...ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ఢిల్లీకి తిరిగి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది చూసి అద్వానీ, సుష్మా స్వరాజ్‌లాంటి సీనియర్‌ పొలిటికల్‌ లీడర్స్‌ గట్టిగా బల్లలు చరిచి అభినందనలు తెలియజేయడం ఇప్పటికీ వైయస్ జగన్‌ అభిమానులకు గుర్తుకొచ్చే ఒక అద్భుత ఘట్టం. 

Back to Top